Nitish kumar Reddy : టీమిండియాకు పెద్ద దెబ్బే.. గాయంతో నాలుగో టెస్టుకు ఆల్ రౌండర్ దూరమయ్యే అవకాశాలు
ప్రధానాంశాలు:
Nitish kumar Reddy : టీమిండియాకు పెద్ద దెబ్బే.. గాయంతో నాలుగో టెస్టుకు ఆల్ రౌండర్ దూరమయ్యే అవకాశాలు
Nitish kumar Reddy: టీమిండియాకు Team India vs England ఇంగ్లండ్‌తో కీలకమైన టెస్టు సిరీస్‌లో ముందు పెద్ద దెబ్బ ఎదురైంది. యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో సిరీస్ మిగతా భాగాన్ని మిస్సయ్యే అవకాశం కనిపిస్తోంది.వివరాల్లోకి వెళితే, నితీశ్ ఆదివారం జిమ్‌లో శిక్షణ సమయంలో మోకాలికి గాయమైంది. అనంతరం నిర్వహించిన స్కానింగ్ రిపోర్ట్‌లో లిగమెంట్ డ్యామేజ్ ఉన్నట్లు నిర్ధారించబడింది. దీంతో ఫిట్‌నెస్ సమస్యల కారణంగా బుధవారం (జూలై 24) నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం లేదని జాతీయ జట్టు వర్గాలు సంకేతాలు ఇచ్చాయి.

Nitish kumar Reddy : టీమిండియాకు పెద్ద దెబ్బే.. గాయంతో నాలుగో టెస్టుకు ఆల్ రౌండర్ దూరమయ్యే అవకాశాలు
Nitish kumar Reddy : గాయంతో దూరం…
ఇంకా బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రాలేనప్పటికీ, టీమ్ మేనేజ్‌మెంట్ నితీశ్‌కు విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం. పరిస్థితి తీవ్రంగా ఉంటే, ఆఖరి టెస్టు నుంచీ పూర్తిగా తప్పుకోవాల్సి కూడా రావచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.నితీశ్ గాయం టీమిండియాకు బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశాలు కలిగించవచ్చు. అతని స్థానాన్ని భర్తీ చేయడమా, లేదా అదనపు బౌలింగ్ ఆప్షన్‌గా మరో ఆటగాడిని పిలవాలా అనే దానిపై బీసీసీఐ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, ఇప్పటికే శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టు సిరీస్‌లో 1-2తో వెనుకంజలో ఉంది. నాలుగో టెస్ట్ విజయంతో సిరీస్ సమం చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. కొందరు ఆటగాళ్లకి కూడా విశ్రాంతి ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. చూస్తుంటే నాలుగో టెస్ట్ సమయానికి జట్టులో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది.