Nitish Kumar Reddy : ఐపీఎల్ ద్వారా ఎంతో మంది ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. కొత్త టాలెంట్ బయటపడుతుంది. తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తరపున ఆడిన యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి (37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న పిచ్‌పై సన్‌రైజర్స్ స్టార్ బ్యాటర్స్ అంతా పెవీలియన్‌కి క్యూ కట్టగా, నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు మంచి స్కోరు దక్కేలా చేశాడు. స్టార్ పేసర్ కగిసో రబడా బౌలింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డి బాదిన సిక్సర్.. ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. ఎవరు ఇతని, బ్యాక్‌గ్రౌండ్ ఏంటని ఆరాలు తీస్తున్నారు.ఐపీఎల్ 2023 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున నితీష్ కుమార్ రెడ్డిని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2023లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను బౌలర్‌గా బరిలోకి దిగాడు.
ఇప్పుడు ఐపీఎల్ 2024లో అతనికి వస్తున్న అవకాశాలని సద్వినియోగం చేసుకుంటున్నాడు. జట్టు కోసం భారీగానే పరుగులు చేస్తున్నాడు.. తన బ్యాటింగ్‌తో అందరి మనసులు గెలుచుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలలో పడినప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ తో జట్టు స్కోరు 182 పరుగులకు చేరువయ్యేలా చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. గత రంజీ ట్రోఫీ సీజన్‌లో బీహార్‌పై 159 పరుగులు చేశాడు. టోర్నీలో మొత్తం 366 పరుగులు చేశాడు. దీంతోపాటు బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసి 25 వికెట్లు తీశాడు. నితీష్ కుమార్ రెడ్డికి కూడా అందరిలానే అనేక కష్టాలు చవిచూశాడు. ఆయన ఈ స్థాయికి చేరడం వెనక తండ్రి ముత్యాల రెడ్డి త్యాగం ఎంతో ఉంది. కొడుకు కెరీర్ కోసం ఆయన ఏకంగా ఉద్యోగమే మానేసాడు. నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి హిందూస్తాన్ జింక్‌లో ఉద్యోగం చేసేవాడు. అయితే నితీష్ ఐదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు.
హిందూస్తాన్ జింక్ కంపెనీ గ్రౌండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ పెరిగిన అతను ప్లాస్టిక్ బాల్‌తో తన ఆటను ప్రారంభించగా, తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అయితే ముత్యాల రెడ్డిని ఉదయ్‌పూర్ ట్రాన్స్‌ఫర్ చేయడంతో అతను కొడుకు కెరీర్ కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. బంధువులు తిట్టిన, తండ్రిని మందలించిన కూడా అవేమి పట్టించుకోలేదట. రాజకీయాలకి భయపడే తన తండ్రి తనని వదిలి పెట్టి వెళ్లలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నితీష్ రెడ్డి. మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సాయంతో కడపలోని ఏసీఏ అకాడమీలో చేరిన అతను మంచి రాటు దేలి భారత జట్టులో స్థానం కోసం కృషి చేస్తున్నాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.