Nitish Kumar Reddy : పంజాబ్‌తో మ్యాచ్‌లో తెలుగోడు వీర‌విహారం.. ఎవ‌రు ఈ నితీష్ కుమార్..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Nitish Kumar Reddy : పంజాబ్‌తో మ్యాచ్‌లో తెలుగోడు వీర‌విహారం.. ఎవ‌రు ఈ నితీష్ కుమార్..?

Nitish Kumar Reddy : ఐపీఎల్ ద్వారా ఎంతో మంది ఆట‌గాళ్లు వెలుగులోకి వ‌స్తున్నారు. కొత్త టాలెంట్ బ‌య‌ట‌ప‌డుతుంది. తాజాగా పంజాబ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ త‌ర‌పున ఆడిన యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి (37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న పిచ్‌పై సన్‌రైజర్స్ స్టార్ బ్యాట‌ర్స్ అంతా పెవీలియ‌న్‌కి క్యూ క‌ట్ట‌గా, నితీష్ కుమార్ రెడ్డి అద్భుత‌మైన‌ బ్యాటింగ్‌తో జట్టుకు మంచి స్కోరు […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 April 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Nitish Kumar Reddy : పంజాబ్‌తో మ్యాచ్‌లో తెలుగోడు వీర‌విహారం.. ఎవ‌రు ఈ నితీష్ కుమార్..?

Nitish Kumar Reddy : ఐపీఎల్ ద్వారా ఎంతో మంది ఆట‌గాళ్లు వెలుగులోకి వ‌స్తున్నారు. కొత్త టాలెంట్ బ‌య‌ట‌ప‌డుతుంది. తాజాగా పంజాబ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ త‌ర‌పున ఆడిన యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి (37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న పిచ్‌పై సన్‌రైజర్స్ స్టార్ బ్యాట‌ర్స్ అంతా పెవీలియ‌న్‌కి క్యూ క‌ట్ట‌గా, నితీష్ కుమార్ రెడ్డి అద్భుత‌మైన‌ బ్యాటింగ్‌తో జట్టుకు మంచి స్కోరు ద‌క్కేలా చేశాడు. స్టార్ పేసర్ కగిసో రబడా బౌలింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డి బాదిన సిక్సర్‌.. ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ క్ర‌మంలోనే నితీష్ కుమార్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. ఎవ‌రు ఇత‌ని, బ్యాక్‌గ్రౌండ్ ఏంట‌ని ఆరాలు తీస్తున్నారు.ఐపీఎల్ 2023 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు త‌ర‌పున నితీష్ కుమార్ రెడ్డిని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2023లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అత‌ను బౌల‌ర్‌గా బ‌రిలోకి దిగాడు.

Nitish Kumar Reddy : ఎవ‌రీ కుర్రాడు..

ఇప్పుడు ఐపీఎల్ 2024లో అతనికి వ‌స్తున్న అవకాశాలని స‌ద్వినియోగం చేసుకుంటున్నాడు. జట్టు కోసం భారీగానే ప‌రుగులు చేస్తున్నాడు.. తన బ్యాటింగ్‌తో అందరి మనసులు గెలుచుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల‌లో ప‌డిన‌ప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ తో జట్టు స్కోరు 182 పరుగులకు చేరువ‌య్యేలా చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. గత రంజీ ట్రోఫీ సీజన్‌లో బీహార్‌పై 159 పరుగులు చేశాడు. టోర్నీలో మొత్తం 366 పరుగులు చేశాడు. దీంతోపాటు బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసి 25 వికెట్లు తీశాడు. నితీష్ కుమార్ రెడ్డికి కూడా అందరిలానే అనేక కష్టాలు చ‌విచూశాడు. ఆయ‌న ఈ స్థాయికి చేర‌డం వెన‌క తండ్రి ముత్యాల రెడ్డి త్యాగం ఎంతో ఉంది. కొడుకు కెరీర్‌ కోసం ఆయన ఏకంగా ఉద్యోగమే మానేసాడు. నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి హిందూస్తాన్ జింక్‌లో ఉద్యోగం చేసేవాడు. అయితే నితీష్ ఐదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు.

Nitish Kumar Reddy పంజాబ్‌తో మ్యాచ్‌లో తెలుగోడు వీర‌విహారంఎవ‌రు ఈ నితీష్ కుమార్

Nitish Kumar Reddy : పంజాబ్‌తో మ్యాచ్‌లో తెలుగోడు వీర‌విహారం..ఎవ‌రు ఈ నితీష్ కుమార్..?

హిందూస్తాన్ జింక్ కంపెనీ గ్రౌండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ పెరిగిన అతను ప్లాస్టిక్ బాల్‌తో తన ఆటను ప్రారంభించ‌గా, తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అయితే ముత్యాల రెడ్డిని ఉదయ్‌పూర్ ట్రాన్స్‌ఫర్ చేయడంతో అతను కొడుకు కెరీర్ కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. బంధువులు తిట్టిన‌, తండ్రిని మంద‌లించిన కూడా అవేమి ప‌ట్టించుకోలేద‌ట‌. రాజ‌కీయాల‌కి భ‌య‌ప‌డే త‌న తండ్రి త‌న‌ని వ‌దిలి పెట్టి వెళ్లలేద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు నితీష్ రెడ్డి. మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సాయంతో కడపలోని ఏసీఏ అకాడమీలో చేరిన అత‌ను మంచి రాటు దేలి భార‌త జ‌ట్టులో స్థానం కోసం కృషి చేస్తున్నాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది