pakistan fan breaks tv after losing
Pakistan Fan : ఆదివారం పాకిస్తాన్ – ఇండియా మధ్య హోరాహోరీగా మ్యాచ్ నడిచిన విషయం తెలిసిందే. చివరి వరకు నువ్వా నేనా అన్నట్టు మ్యాచ్ సాగగా, చివరకు టీమిండియా విజయాన్ని సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లకు 159 పరుగులు చేసింది. ఇక 160 పరుగుల లక్ష్య చేధనలో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. చేజింగ్ మాస్టర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (82 నాటౌట్ 53 బంతుల్లో 6×4, 4×6) భారత క్రికెట్ చరిత్రలోనే ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియాకు ఊహించని విజయాన్ని అందించాడు.
160 పరుగుల లక్ష్య ఛేదనలో 31 పరుగులకే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. హార్దిక్ పాండ్యా (40; 37 బంతుల్లో 1×4, 2×6)తో కలిసి 113 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యంతో కోహ్లీ జట్టును తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చాడు. భారత్ విజయానికి చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు కావాల్సి ఉండగా కోహ్లీ మ్యాజిక్ కారణంగా.. చివరి 6 బంతులకు 16 రన్స్ అవసరం అయ్యాయి.కోహ్లీ ఉన్నాడనే ధైర్యం తప్ప భారతీయులకి మ్యాచ్‌పై ఏ మాత్రం నమ్మకం లేదు. అయితే చివరకి వరకు మొబైల్, టీవీ దగ్గర నుంచి పక్కకు కూడా జరగలేదు. కళ్లార్పకుండా ప్రతి బంతిని చూశారు.
pakistan fan breaks tv after losing
స్పిన్నర్ మొహ్మద్ నవాజ్ వేసిన నో బాల్ కారణంగా భారత్ విజయ సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ఐదో బంతికి దినేష్ కార్తీక్ స్టంపౌట్ అవ్వడంతో మ్యాచ్ మరింతరసవత్తరంగా సాగింది. దాంతో భారత్, పాకిస్తాన్ అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోయింది. చివరి బంతికి అశ్విన్ సింగిల్ తీయడంతో మ్యాచ్ భారత్ సొంతమైంది. దాంతో భారత అభిమానులు సంబరాలు చేసుకోగా, ఇంట్లో మ్యాచ్ చూస్తున్న ఓ పాక్ అభిమాని.. అసహనంలో టేబుల్‌పై ఉన్న లాప్ టాప్‌ను తీసి టీవీపై విసిరాడు. కిందపడేసి కాలితో తన్నాడు. దాంతో టీవీ బద్దలైంది. ఇందుకు సబంధించిన వీడియోని సెహ్వాగ్ నెట్టింట్లో షేర్ చేయగా, తెగ వైరల్ అవుతుంది. గతంలోను ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.