
IPL 2024 : కోహ్లీ ఆగయా.. ఈ సారి ఏ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడంటే.!
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ కు అంతా సిద్ధమైంది. మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో మంచి విజయం సాధించాలని అందరు కోరుకుంటున్నారు. అయితే కొన్నాళ్లుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న విరాట్ తిరిగి రావడం, అలానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ జట్టు ట్రోఫీ గెలుచుకోవడంతో ఈ సారి ఆర్సీబీ మెన్ జట్టు మంచి జోష్‌లో కనిపిస్తుంది. అయితే ఈ సారి బ్యాటింగ్‌లో కూడా పలు మార్పులు చేసి ట్రోఫీ దక్కించుకోవాలని కసి మీద ఉంది.
ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ జోడీతో పాటు బౌలింగ్ యూనిట్‌లోనూ కీలక మార్పులు చేసి కప్ కొట్టాలని భావిస్తుంది ఆర్సీబీ జట్టు. గత సీజన్‌లో ఫాఫ్ డుప్లెసిస్‌తో కలసి సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయగా, ఈ సారి ఆస్ట్రేలియా హిట్టర్ గ్రీన్‌తో కలిసి ఫాఫ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని టాక్. ఇక ఫస్ట్ డౌన్‌లో కోహ్లీ రానున్నాడు. రజత్ పాటిదార్ సెకండ్ డౌన్‌లో వస్తాడని టాక్. ఇక ఆ తర్వాతి స్థానాలలో మ్యాక్స్‌వెట్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ ఆడతారని టాక్ నడుస్తోంది. ఇక బౌలింగ్ విషయంలోను ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారని సమాచారం. సిరాజ్ మెయిన్ బౌలర్‌గా ఉండనుండగా, ఆకాశ్ దీప్, అల్జారీ జోసెఫ్ పేస్ బాధ్యతల్ని పంచుకుంటారు.
ఫస్ట్ ఛాయిస్ స్పిన్నర్‌గా కరణ్ శర్మ ఉంటాడు.అయితే కోహ్లీ ఫస్ట్ డౌన్ బ్యాటింగ్‌పై చర్చనీయాంశంగా మారింది. జూన్‌లో టీ20 వరల్డ్ కప్ ఉండనుండగా, దానికి విరాట్‌ని కూడా ఎంపిక చేసే ఆలోచనలో బీసీసీఐ ఉంది. అందుకోసమే కోహ్లీని ఫస్ట్ డౌన్‌లో దింపే ఆలోచన చేస్తున్నట్టు సమచారం. కాగా కోహ్లీ గత రెండు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నారు. ఆయన మరోసారి తండ్రి కావడంతో చాలా సంతోషంలో ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో అదరగొట్టిన కోహ్లీ స్వదేశంలో జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌కు పూర్తిగా దూరంగా ఉన్నాడు. అనుష్క రెండో బిడ్డకి జన్మనివ్వడంతో ఆయన లండన్ వెళ్లాగా అప్పటి నుండి అక్కడే ఉండి రీసెంట్‌గా ఇండియాకి వచ్చాడు. ఇక మళ్లీ క్రికెట్‌తో బిజీ కానున్నాడు.
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
This website uses cookies.