Rishabh Pant : ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. 25 ఏళ్ల త‌ర్వాత‌ చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్..!

 Authored By ramu | The Telugu News | Updated on :23 June 2025,9:18 pm

ప్రధానాంశాలు:

  •   టెస్ట్ క్రికెట్‌లో అరుదైన రికార్డు సాధించిన రిషభ్ పంత్

  •  ఇంగ్లండ్‌ బౌలర్లకు చెమటలు పట్టించిన పంత్

  •  Rishabh Pant : ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. 25 ఏళ్ల త‌ర్వాత‌ చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్..!

Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు సాధించి, ఒకే టెస్ట్‌లో డబుల్ సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. టెస్ట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇంతకముందు 2000లో జింబాబ్వే ఆటగాడు ఆండీ ఫ్లవర్ మాత్రమే ఈ ఫీట్‌ను సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పంత్, రెండో ఇన్నింగ్స్‌లో 129 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

Rishabh Pant : ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. 25 ఏళ్ల త‌ర్వాత‌ చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్..!

Rishabh Pant : ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. 25 ఏళ్ల త‌ర్వాత‌ చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్..!

Rishabh Pant :  ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేసి సరికొత్త రికార్డు సృష్టించిన పంత్

మ్యాచ్ నాలుగో రోజు 90/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో భారత్ ఆరంభించగా, తొందర్లోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అవుట్ అయ్యాడు. అయితే ఆ తరువాత పంత్, రాహుల్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఇద్దరూ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్ 202 బంతుల్లో సెంచరీ చేయగా, పంత్ దూకుడుగా ఆడి 83 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం పంత్ 118 పరుగులు చేసి ఔట్ కాగా, వీరి భాగస్వామ్యం వల్ల భారత్ 300 పరుగుల ఆధిక్యం దాటగలిగింది. మూడో సెషన్‌లో పంత్ ఒంటి కన్ను సెలెబ్రేషన్ తో తన సెంచరీ జరుపుకున్నారు, ఇది అభిమానులను ఆకట్టుకుంది.

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 465 పరుగులతో సమాధానం ఇచ్చింది. దీంతో భారత్‌కు స్వల్పంగా 6 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో పంత్, రాహుల్ సెంచరీలతో భారత్ భారీ స్కోర్ చేసింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 300 పరుగులు దాటడం, మ్యాచ్‌ను టీమిండియా పూర్తిగా తమవైపు తిప్పుకున్నట్లు సూచిస్తోంది.

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి