Rishabh Pant : పంత్‌కు భారీ గాయం.. ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ కు పంత్ దూరం..!
ప్రధానాంశాలు:
పంత్‌కు భారీ గాయం.. ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ కు పంత్ దూరం..!
పంత్ కు గాయం..ఆయన స్థానంలో ఎవరో..?
Rishabh Pant : ఇండియా India , England ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్‌లో జరుగుతున్న 4th Test Match నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియాకు తీవ్రమైన షాక్ తగిలింది. మొదటి రోజున బ్యాటింగ్ చేస్తుండగా కీలక బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ తీవ్ర గాయానికి గురయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ వేసిన ఓ బంతిని రివర్స్ స్వీప్ చేయబోయిన పంత్‌కి బంతి నేరుగా షూ పై పడింది. ఇది LBW కావచ్చంటూ ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా రివ్యూలో ఆయన నాట్ అవుట్‌గా తేలింది. అయితే ఆ వెంటనే అతడికి తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే మైదానంలోనే పడిపోయాడు. మెడికల్ టీమ్ వచ్చి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

Rishabh Pant : పంత్‌కు భారీ గాయం.. ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ కు పంత్ దూరం..!
Rishabh Pant పంత్‌కు భారీ గాయం.. నొప్పి భరించలేక కన్నీరు
ఈ గాయం నేపథ్యంలో రిషబ్ పంత్ ‘రిటైర్డ్ హర్ట్’గా వెనుదిరగాల్సి వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో పంత్ కేవలం 48 బంతుల్లో 37 పరుగులు చేశాడు. దీంతో మూడో వికెట్ వరకు నిలకడగా ఆడిన టీమిండియా, పంత్ గాయంతో కొంత ఒత్తిడిలో పడింది. గతంలో లార్డ్స్ టెస్టులో కూడా పంత్ వేలికి గాయం కావడం వల్ల వికెట్ కీపింగ్‌కు దూరమయ్యాడు. అప్పట్లో ఎనిమిది రోజుల విశ్రాంతి తీసుకొని తిరిగి జట్టులోకి వచ్చాడు. కానీ ఈసారి గాయం తీవ్రంగా ఉండడంతో మిగిలిన సిరీస్‌కు దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
రిషబ్ పంత్ గాయంతో టీమిండియా దెబ్బతిన్న పరిస్థితిలో ఉంది. ఇప్పటికే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి బ్యాటింగ్‌లో విఫలమవ్వడంతో ఈ మధ్యలో పంత్ పాత్ర కీలకంగా మారాడు. కానీ అతడు కూడా గాయపడటంతో బ్యాటింగ్ లోయర్ ఆర్డర్‌పై భారం పడింది. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 264 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో మిగతా ఆటగాళ్లపై భారీ భారం పడుతోంది. టీమిండియా విజయావకాశాలు నిలబడాలంటే మిగిలిన బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.