Rishabh Pant : ప్రస్తుతం ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రెండు కూడా మనోళ్ల దగ్గరే ఉన్నాయి. ఇక చాలా రోజులుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న పంత్ కూడా ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. 2022లో జరిగిన ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ మళ్లీ ఐపీఎల్‌తో పునరాగమనం చేశాడు. ఇప్పుడు ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పంత్ అప్పటి మాదిరిగా ఆడలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో పంత్ 30.60 సగటుతో మొత్తం 153 పరుగులు చేశాడు.ఇందులో 2 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇక ఢిల్లీ ఆడిన మ్యాచ్‌లలో నాలుగు ఓడిపోగా, రెండు గెలుపొందింది. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో మంచి విజయం సాధించింది ఢిల్లీ జట్టు.
అయితే ఎకానా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టు 15 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేసింది. అయితే, ఈ సందర్భంలో రిషబ్ పంత్ గందరగోళం సృష్టించాడు. 4వ ఓవర్ బౌలింగ్ వేయడానికి ఇషాంత్ శర్మను పిలిచాడు. ఇషాంత్ శర్మ వేసిన నాలుగో ఓవర్ నాలుగో బంతిని పడిక్కల్ బౌల్డ్ చేశాడు. అయితే పంత్ ఓ సందర్భంలో పచ్చి అబద్ధం ఆడినట్టు కెమెరాలలో రికార్డ్ అయింది. ఇషాంత్ వేసిన బంతి లెగ్ సైడ్ నుంచి బంతి నేరుగా పంత్ చేతుల్లోకి వెళ్లగా దానిని అంపైర్ వైడ్‌ని ప్రకటించాడు. అయితే అప్పుడు దీనికి సంబంధించి రివ్యూ తీసుకున్నాడు.
రివ్యూలో అది వైడ్ అని తేలడంతో ఢిల్లీ రివ్యూని కోల్పోవలసి వచ్చింది. అయితే ఆ సమయంలో పంత్ నేరుగా అంపైర్ దగ్గరకు వెళ్లి యశ్వంత్ బర్డేతో వాగ్వాదానికి దిగాడు. నేను రివ్యూ తీసుకోలేదని అంపైర్‌కు చెప్పాడు. కానీ, రీప్లేలలో చూసినప్పుడు, పంత్ స్పష్టమైన సమీక్ష తీసుకున్నట్టుగా కనిపించింది. అయితే తాను మాత్రం తన జట్టు సభ్యుడికి వివరిస్తున్నట్లు అంపైర్‌కు పదేపదే చెప్పాడు. అయితే, పంత్ సమీక్ష కోసం సూచించినట్లు కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది.దీనిపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇలా అబద్దాలు ఆడుతున్నావ్ అంటూ పంత్‌ని తిట్టి పోస్తున్నరు. ఇక ఈ మ్యాచ్‌లో పంత్ 41 పరుగులు చేశాడు. ఢిల్లీ కూడా మంచి విజయం సాధించింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.