
Heart Attack : ఇలాంటి గుండెనొప్పిని అస్సలు నమ్మకండి.. చాలా డేంజర్..!
Heart Attack : ఈ రోజుల్లో గుండెపోటు మరణాలు.. హార్ట్ ఎటాక్ లాంటివి తరచూ వినిపిస్తున్నాయి. ఒకప్పుడు హార్ట్ ఎటాక్ మరణాలు చాలా రేర్ గా వినిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగా తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు పెద్ద వయసు వారిలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం చిన్న వయసు వారిలో కూడా కనిపిస్తున్నాయి. దాంతో ప్రజలు నిత్యం ఆందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. అయితే గుండె నొప్పిలో చాలా రకాలు ఉంటాయి. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.వాటిని నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతి అని డాక్టర్లు చెబుతున్నారు. చాలా మందికి గుండెపోటు ముందు వచ్చే నొప్పికి సాధారణ నొప్పికి తేడాలు తెలియవు. దాంతో కొందరు నొప్పి వచ్చినా సరే లైట్ తీసుకుంటారు ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుని ఇంట్లోనే ఉండిపోతారు. అలాంటి వారికి గుండెపోటు వచ్చి సడెన్ గా ప్రాణాలు కోల్పోయే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది.
తీవ్రంగా నొప్పి వస్తుంటే మాత్రం కచ్చితంగా నిర్లక్ష్యం చేయొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. కానీ కొందరు మాత్రం తేడాలు తెలియక.. అది సాధారణనొప్పి అనుకుంటారు. ఇలాంటి వారి కోసం ఇప్పుడు కొన్ని టిప్స్ తెలుసుకుందాం.భరించ లేనంత చాతినొప్పి చిన్నదే కావచ్చు. కానీ ఛాతినొప్పి వచ్చే సమయంలో నొప్పి మెడ, దవడకు, తరువాత వెనుకకు లేదా కిందకి, ఒకటి లేదా రెండు చేతులకు వ్యాపిస్తుంది. అప్పుడు అస్సలు విస్మరించకూడదు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ నొప్పి గుండె సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది. ఛాతినొప్పిలో కూడా వివిధ రకాలు ఉంటాయి.
Heart Attack : ఇలాంటి గుండెనొప్పిని అస్సలు నమ్మకండి.. చాలా డేంజర్..!
ఛాతినొప్పి వచ్చే సమయంలో వికారం వాంతులు కూడా అవుతాయి. అప్పుడు అస్సలు లైట్ తీసుకోవద్దు.
చాతినొప్పి వచ్చిన సమయంలోనే చల్లని చెమటలు వస్తుంటాయి. వాటిని అస్సలు లైట్ తీసుకోవద్దు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినప్పుడు కూడా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి.
గుండె వేగంగా కొట్టుకుంటే కూడా అది తీవ్రమైన గుండె నొప్పికి దారి తీస్తుంది.
మైకము లేదా బలహీనతగా ఉన్నా కూడా వెంటనే చికిత్స తీసుకోవాలి.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.