Shivam Dube : ఏదో పొడుస్తాడు అనుకుంటే వరల్డ్ కప్‌లో చెత్త ప్రదర్శన కనబరుస్తున్న ధోని శిష్యుడు
Shivam Dube : ఈ ఏడాది ఐపీఎల్ ఫస్టాఫ్‌లో అద్భుతంగా ప్రదర్శన కనబరచడంతో శివమ్ దూబేని వరల్ట్ కప్ జట్టులోకి ఎంపిక చేయడం మనం చూశాం. అయితే ఎప్పుడైతే టీంలోకి ఎంపికయ్యాడో అప్పటి నుండి చెత్త ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నప్పటి నుంచి శివమ్ దూబే శివాలెత్తిపోతున్నాడు. అతడి పవర్ హిట్టింగ్ సామర్థ్యాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తీవ్రమైన పోటీ ఉన్నా కూడా.. భారత సెలక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారు. రింకూ సింగ్ లాంటి ఫినిషర్‌ను పక్కనపెట్టి మరీ టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు కల్పించారు.
Shivam Dube ఇక మనోడు కష్టమే..
మిడిల్ ఓవర్‌లలో పవర్ హిట్టింగ్ చేయగలడని భావించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ గతంలో మాదిరిగా వేగంగా ఆడలేకపోతున్నాడు. దీంతో జట్టును మరింత కష్టాల్లోకి నెడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన దూబే తీవ్రంగా నిరాశపరిచాడు. గత రాత్రి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌తో కూడా నిరాశపరిచాడు. పాకిస్థాన్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మహ్మద్ రిజ్వాన్ క్యాచ్‌ను శివమ్ దూబే జారవిడిచాడు. బుమ్రా వేసిన లెంగ్త్ బంతికి రిజ్వాన్ క్రాస్ ఆడగా, బంతి డీప్ ఫైన్ లెగ్‌లోకి వెళ్లింది. దూబేకి క్యాచ్‌కి అవకాశం లభించినా, చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ని చేజేతులా జారవిడిచాడు. దీంతో దూబేపై ఓ రేంజ్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Shivam Dube : ఏదో పొడుస్తాడు అనుకుంటే వరల్డ్ కప్‌లో చెత్త ప్రదర్శన కనబరుస్తున్న ధోని శిష్యుడు
ధోని ఆధ్యర్వంలో ట్రైనింగ్ తీసుకుని, ఆయన పేరును చెడుగొడుతున్నావంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన స్థానంలో రింకూని కాని లేదంటే అభిషేక్ శర్మని కాని తీసుకొని ఉంటే బాగుండేదని కొందరు చెప్పుకొస్తున్నారు. టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించిన తర్వాత అంటే.. మే 1 నుంచి ఐదు మ్యాచులు ఆడిన దూబే.. ఒక్క మ్యాచ్‌లో కూడా మంచి ప్రదర్శన చేయలేదు. అతను పాకిస్తాన్ మ్యాచ్‌లో కూడా పరుగులు రాబట్టలేక ఔటయ్యాడు.