Ind VS Eng : ఆ ప్లేయర్‌కు దారుణమైన అన్యాయం చేస్తున్న రోహిత్ శర్మ.. ఫ్రెండ్ కోసం అతడిపై వేటు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ind VS Eng : ఆ ప్లేయర్‌కు దారుణమైన అన్యాయం చేస్తున్న రోహిత్ శర్మ.. ఫ్రెండ్ కోసం అతడిపై వేటు

 Authored By kranthi | The Telugu News | Updated on :27 October 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  షమీని పక్కన పెట్టి అశ్విన్ కు చాన్స్ ఇస్తాడా?

  •  ఇంగ్లండ్ మ్యాచ్ లో పాండ్యా స్థానంలో చాన్స్ ఎవరికి?

  •  రోహిత్ శర్మ నిర్ణయమే ఫైనలా?

Ind VS Eng : భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా. ఐసీసీ వన్ డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ వేస్తూనే హార్దిక పాండ్యా గాయపడ్డాడు. దీంతో అతడు ఆ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఆడలేదు. అంతే కాదు.. మరో రెండు మ్యాచ్ లకు కూడా దూరం కానున్నాడు హార్దిక్ పాండ్యా. ఇంకా రెండు వారాల పాటు పాండ్యాకు రెస్ట్ అవసరమని డాక్టర్లు కన్ఫమ్ చేయడంతో పాండ్యా ప్లేస్ ను ఎవరితో భర్తీ చేయాలో తెలియక టీమిండియా సతమతమవుతోంది. స్పష్టంగా పాండ్యా లేని లోటు టీమిండియాకు తెలుస్తోంది. మరోవైపు టీమిండియా ఐసీసీ వరల్డ్ కప్ లో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ లలో టీమిండియా ఐదు మ్యాచ్ లలో విజయం సాధించింది. టాప్ ప్లేస్ లో ఉంది. 10 పాయింట్స్ తో వరల్డ్ కప్ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంది టీమిండియా.

ఇక.. ఆరో మ్యాచ్ ఈనెల 29న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య లక్నో స్టేడియంలో జరగనుంది. హార్దిక్ పాండ్యాకు గాయం కావడంతో ఇప్పటికే న్యూజిలాండ్ మ్యాచ్ కు దూరం అయ్యాడు. ఇంగ్లండ్ మ్యాచ్ కి కూడా పాండ్యా దూరం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్ మ్యాచ్ లో పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కి చోటు దక్కింది. అయితే.. ఫస్ట్ నుంచి వన్డే ప్రపంచకప్ లో తొలి నాలుగు మ్యాచ్ లు మహమ్మద్ షమీ ఆడలేదు. ఐసీసీ వరల్డ్ కప్ లో షమీని కావాలని పక్కకు పెట్టారని క్రికెట్ అభిమానులు వాపోతున్నారు. షమీ స్థానంలో శార్దూల్ ను ఆడిస్తున్నారు. బౌలింగ్ మాత్రమే కాదు.. శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ కూడా చేస్తాడు కాబట్టి.. అతడిని మ్యాచ్ లలో బ్యాటింగ్ చేయనిచ్చారు. అయినా కూడా శార్దూల్ పెద్దగా రాణించిందేం లేదు.

Ind VS Eng : ఇంగ్లండ్ మ్యాచ్ లో కూడా షమీని పక్కన పెట్టి అశ్విన్ కు చోటు

ఇంగ్లండ్ తో మ్యాచ్ లో కూడా షమీని పక్కన పెట్టి రోహిత్ శర్మ.. రవిచంద్రన్ అశ్విన్ ను తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రపంచకప్ లో ముందు అశ్విన్ కు చోటు దక్కున్నా.. ఆ తర్వాత రోహిత్ శర్మ వల్ల జట్టులో చోటు సంపాదించాడు. మరి.. ఇంగ్లండ్ మ్యాచ్ లో షమీని పక్కన పెట్టి అశ్విన్ కు చాన్స్ ఇస్తాడా? లేక సిరాజ్ ను పక్కన పెట్టి అశ్విన్, షమీ ఇద్దరినీ ఇంగ్లండ్ మ్యాచ్ లో తీసుకుంటారా అనేది తెలియదు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది