Home » News » Sachin Tendulkar Tweet What Is Your Opinion On This Billy Bowden
News

Viral Video : దీనిపై మీ అభిప్రాయం ఏంటీ బిల్లీ బౌడెన్..? సచిన్ ట్వీట్ వైరల్ వీడియో..!

Authored By
mallesh
The Telugu News | Published on: December 14, 2021, 11:40 am
Advertisement

Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన అంశంపై వెంటనే పోస్టుల రూపంలో స్పందిస్తుంటారు. ఒక్కోసారి ఆయన పెట్టే పోస్టులు స్పూర్తి పొందేవిగా ఉంటే మరికొన్ని మెదడుకు మెత పెడుతుంటాయి.మరికొన్ని ఫన్నీగాను అనిపిస్తుంటాయి. తాజాగా సచిన్ ఓ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతోంది.

Advertisement

సచిన్ వీడియో షేర్ చేస్తూనే ఎంపైర్ ‘బిల్లీ బౌడెన్’ గురించి ప్రస్తావించారు. క్రికెట్‌లో ఆటగాళ్లు ఎంత కీలకమో ఎంపైర్ కూడా అంతే. సాధారణంగా చాలా మంది ఎంపైర్లు సైలెంట్‌గా, వికెట్లకు ఎదురుగా నిలబడి చేతుల ద్వారా సిగ్నల్స్ ఇస్తుంటారు. ఫోర్, సిక్సర్, ఔట్, వైడ్, నోబాల్స్ వంటి సిగ్నల్స్‌ను క్రికెట్ పరిభాష ప్రకారం చెబుతుంటారు. అయితే, ఎంపైర్ ‘బిల్లీ బౌడెన్’ మాత్రం కాస్త డిఫరెంట్. ఆయన మైదానంలో తన ఎంపైరింగ్ స్టైల్‌తో నవ్వులు పూయిస్తుంటారు.

Sachin Tendulkar tweet what is your opinion on this billy bowden

Advertisement

Sachin Tendulkar : వైడ్ సిగ్నల్ ఇలా కూడా ఇస్తారా..?

బిల్లీ ఎంపైరింగ్‌ను కామెంటర్స్‌తో పాటు ఫ్యాన్స్ కూడా తెగ ఏంజాయ్ చేస్తుంటారు. తాజాగా మన దేశంలోని ఓ ప్రాంతంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్‌లో ఓ ఎంపైర్ వైడ్ సిగ్నల్ ఎలా ఇచ్చారంటే.. అది చూసి క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవ్వడమే కాకుండా తెగ నవ్వుతున్నారు. ఏకంగా తల భూమిపై పెట్టి రెండు కాళ్లు అడ్డంగా చాపి వైడ్ అని ప్రకటించి ఆ తర్వాత చేతులతో చెప్పారు. అది కాస్త సచిన్ వద్దకు చేరడంతో దీనిని షేర్ చేస్తూ.. ‘దీనిపై మీ అభిప్రాయం ఎంటీ.. బిల్లీ బౌడెన్..? అంటూ ట్వీట్ చేశారు. అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి