Intinti Gruhalakshmi 14 Dec Today Episode : ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నాటకం ఆడి తులసిని తన ప్లాన్ లో ఇరికించిన లాస్య.. చివరకు నందుతో పెళ్లి ఒప్పించిందా?

Intinti Gruhalakshmi 14 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 డిసెంబర్ 2021, మంగళవారం 502 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసిని చూడటానికి మాధవి, తన భర్త వస్తారు. తులసిని పరామర్శిస్తారు. దీంతో నాకు ఇప్పుడు ఏం కాలేదు. మీరు ఏం టెన్షన్ పడకండి అంటుంది తులసి. నీకు ఏం కాకపోతే ఎందుకు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు వదిన అంటుంది మాధవి. దేవుడు నాకు పరీక్ష పెట్టాడు. ఇప్పుడు పరీక్ష రాస్తున్నాను అంటూ తులసి ఏదేదో చెబుతుంది. ఇంత బాధ వచ్చినా మాకు ధైర్యం చెబుతున్నావు నువ్వు తులసి అంటాడు తన అన్నయ్య. ఇంతలో ఆంటి.. అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది అంకిత. లాస్య ఆంటి.. అంటూ ఏదో అనబోతుంది. ఏమైంది లాస్యకు ఏమైంది అంటాడు నందు.

intinti gruhalakshmi 14 december 2021 full episode

పరిగెత్తుకుంటూ రూమ్ కు వస్తాడు. చూసేసరికి.. లాస్య మంచంలో పడిపోయి ఉంటుంది. లాస్య.. అని లేపడానికి ప్రయత్నిస్తాడు. పక్కనే విషం బాటిల్ ఉంటుంది. ఏమైంది అని చూస్తే దాన్ని తాగేస్తుంది. సూసైడ్ అటెంప్ట్ చేసిందనుకుంటా అంటాడు నందు. వెంటనే అద్వైత కృష్ణను పిలుస్తాడు. అమ్మా అంకిత నువ్వు వెళ్లి సాల్ట్ వాటర్ తీసుకురా అంటుంది తులసి. వెంటనే తీసుకొస్తుంది. వాటిని తాగించేందుకు ప్రయత్నిస్తుంది తులసి. దీంతో లాస్య మొత్తం వాంతి చేసుకుంటుంది. ఏం కాదు అని అంటుంది తులసి. ఇంటి వాళ్లు అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. తులసి.. ఏమైంది అని అంటాడు కృష్ణ. లాస్య ఆత్మహత్యాయత్నం చేసింది అంటుంది. తనను చెక్ చేస్తాడు. తన పల్స్ వీక్ గా ఉంది. తనకు కొంచెం రెస్ట్ ఇవ్వండి అంటాడు కృష్ణ. నందు తెగ బాధపడిపోతాడు. అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు.

నందు బయటికి వచ్చి తెగ బాధపడతాడు. లాస్య గురించి తలుచుకొని బాధపడతాడు. ఇంతలో తులసి బయటికి వస్తుంది. లాస్యను ఏమన్నారు అని ప్రశ్నిస్తుంది. లాస్య మనసును బాధపెట్టేలా ఏం చేశారు అని నిలదీస్తుంది తులసి. అదేంటి తులసి.. నన్నేదో దోషిలా చూస్తున్నావు ఎందుకు అంటాడు నందు. ఏమనకపోతే.. తన మనసును బాధపెట్టకపోతే.. ఆత్మహత్యాయత్నం ఎందుకు చేస్తుంది అంటుంది తులసి.

తులసి.. ముందు నువ్వు కూల్ గా మాట్లాడు. అసలే నీ ఆరోగ్యం బాగాలేదు అంటాడు నందు. ఆత్మహత్య చేసుకునేంతగా లాస్యను మీరు ఏమన్నారు అంటుంది. లాస్యను ఏమన్నారో చెప్పండి అని అడుగుతుంది. లాస్యను మాటలతో విసిగిస్తున్నారు. నన్ను మౌనంతో చిరాకుతెప్పిస్తున్నారు. ఎవరిదైనా ప్రేమే. ఆ ప్రేమ గుండెలను బద్ధలు చేస్తే ఏ ఆడదాని ప్రేమైనా ఇలాగే ఉంటుంది.. అని చెబుతుంది తులసి.

Intinti Gruhalakshmi 14 Dec Today Episode : లాస్యను పెళ్లి చేసుకోవాలంటూ నందును నిలదీసిన తులసి

నాకేదో అనుమానం ఉంది. మీరు లాస్యను మోసం చేద్దామనుకుంటున్నారా? పెళ్లి విషయంలో లాస్యకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా పారిపోయే ప్రయత్నం చేస్తున్నారా? ఎలాగూ మన బంధాన్ని నిలుపుకోలేకపోయారు. బంధాన్ని నిలబెట్టుకుంటానని లాస్యకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోరా అని ప్రశ్నిస్తుంది తులసి.

తప్పు పట్టాల్సింది ప్రేమను కాదు.. మిమ్మల్ని. అసలు మిమ్మల్ని ప్రేమించడమే పెద్ద తప్పు. అంతకన్నా పెద్ద తప్పు ఇంకేం ఉండదు.. అని నిలదీస్తుంది తులసి. మీకసలు అర్థం అవుతోందా? కేవలం మిమ్మల్ని ప్రేమించిన పాపానికి తను ప్రాణం తీసుకోవాలనుకుంది అంటుంది.

నేను తనను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. నీ ఆరోగ్యం కుదుటపడ్డాక నేను తనను పెళ్లి చేసుకుంటా అంటే నా ఆరోగ్యంతో మీకెందుకు. నాకు సంవత్సరాల తరబడి ట్రీట్ మెంట్ జరుగుతుంది. అలాగని వెయిట్ చేస్తారా? అంటూ ప్రశ్నిస్తుంది తులసి. నా ఆరోగ్యం గురించి నేను చూసుకుంటాను. మీకు, నాకు ఏ సంబంధం లేదు. వెంటనే లాస్యను పెళ్లి చేసుకోండి అంటుంది తులసి.

మరోవైపు లాస్యకు స్పృహ వస్తుంది. నేను ఇక వినలేను అని నందుతో అంటుంది లాస్య. చచ్చిపోదామనుకున్నాను. మళ్లీ ఎందుకు బతికించావు. ప్రశాంతంగా ఎలాగూ బతకలేకపోతున్నాను. కనీసం ప్రశాంతంగా చావనీయవా అంటుంది లాస్య. దీంతో తులసి వచ్చి లాస్య.. అని పిలుస్తుంది. చెంప చెల్లుమనిపిస్తుంది తులసి.

ఆ తర్వాత తనను హత్తుకుంటుంది తులసి. దీంతో ఎవ్వరికీ ఏం అర్థం కాదు. సమస్యల నుంచి పారిపోయే వాళ్లంటే నాకు అసహ్యం. బలవంతంగా జీవితాన్ని ముగించాలి అనుకోవడం అతి పెద్ద తప్పు. చావడానికి ధైర్యం ఉన్నప్పుడు బతకడానికి ధైర్యం లేదా.. అని ప్రశ్నిస్తుంది తులసి.

అసలు నీ మీద ఎంత కోపంగా ఉందో తెలుసా? ఎంతో పుణ్యం చేస్తే కానీ.. మనకు మనిషి జన్మ దొరకదు. పిచ్చిదానిలా దాన్ని వృథా చేస్తావా. జీవితం ఎంత విలువైందో తెలియాలంటే ఆఖరి శ్వాస తీసుకునే మనిషిని అడుగు అప్పుడు తెలుస్తుంది. నా లాంటి దాన్న అడుగు.. బతుకు విలువ తెలుస్తుంది.. అంటుంది తులసి.

కష్టం వచ్చిన ప్రతివాళ్లు చావాలనుకుంటే లోకమంతా శవాల గుట్టే మిగులుతుంది. నన్ను చూడు. నీ కష్టం నా కష్టం కన్నా ఎక్కువా.. అంటూ తన కష్టాల గురించి చెబుతుంది తులసి. లాస్యకు ధైర్యం చెబుతుంది. చచ్చి నువ్వు ఎవ్వరినీ సాధించేది లేదు. బతికి అనుకున్నది సాధించు అని చెబుతుంది తులసి.

ఆ తర్వాత తులసి ఇంట్లో నుంచి వెళ్లిపోబోతుంది. తనను ఎంత ఆపాలని ప్రయత్నించినా ఆగదు. నువ్వు లాస్యను పెళ్లి చేసుకుంటా అని చెబితేనే నేను ఉంటా అని చెబుతుంది తులసి. దీంతో సరే.. చేసుకుంటాను అని చెప్పి కోపంతో లోపలికి వెళ్లిపోతాడు నందు. అయితే.. ఇదంతా లాస్య ప్లాన్ అని.. లాస్య ప్లాన్ లో తులసి పడిపోయిందనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Rice | నెల రోజులు అన్నం మానేస్తే శరీరంలో ఏమవుతుంది? .. వైద్య నిపుణుల హెచ్చరికలు

Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…

4 hours ago

Montha Effect | ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ఆగ్రహం .. నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం

Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…

6 hours ago

Harish Rao | హరీశ్ రావు ఇంట్లో విషాదం ..బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విరామం

Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…

7 hours ago

Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్‌ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు

Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…

8 hours ago

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

11 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

14 hours ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

1 day ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

1 day ago