Shoaib Akhtar : భార‌త్ ఆట‌గాళ్లు తీస్‌మార్‌ఖాన్‌లు ఏం కాదు.. వాళ్లు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తారంటూ షోయబ్ అక్తర్ ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shoaib Akhtar : భార‌త్ ఆట‌గాళ్లు తీస్‌మార్‌ఖాన్‌లు ఏం కాదు.. వాళ్లు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తారంటూ షోయబ్ అక్తర్ ఫైర్

 Authored By sandeep | The Telugu News | Updated on :29 October 2022,12:00 pm

Shoaib Akhtar : ప్ర‌స్తుతం టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ మంచి మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న విష‌యం తెలిసిందే. సెమీస్‌కి వెళ్ల‌డానికి ఇంకెంత దూరం లేదు. అయితే భారత్ విజ‌యాల‌ని భ‌రించ‌లేక‌పోతున్న షోయ‌బ్ అక్తర్ అక్క‌సు వెళ్ల‌గక్కాడు. . టోర్నీలో రెండు విజయాలు సాధించిన టీమిండియాకు టైటిల్ గెలిచే సీన్ లేదని, సెమీస్‌లో ఓడి ఇంటి దారి పట్టడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. మెగాటోర్నీలో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్‌పై గెలుపొందింది. ఇక మిగిలిన మ్యాచుల్లో సౌతాఫ్రికా గండాన్ని దాటితే… బంగ్లా, జింబాబ్వేలపై మ్యాచులు గెలిస్తే సరిపోతుంది. సఫారీలతో ఓడినా టీమిండియా సెమీస్ బెర్త్‌కు వచ్చే నష్టం ఏం లేదు.

షోయ‌బ్ అక్త‌ర్ మాత్రం త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్క‌డం హ‌ట్ టాపిక్‌గా మారింది. బాబర్ ఆజమ్ చేతకాని కెప్టెన్ అని, వరల్డ్ కప్‌ నుంచి పాకిస్తాన్ నిష్ర్కమించినట్టేనని వ్యాఖ్యానించాడు. అయితే అంతటితో ఆగకుండా చక్కటి ప్రదర్శన చేస్తున్న భారత్‌ జట్టుపైనా అతి అంచనా వేశాడు. వరల్డ్ కప్ నుంచి భారత్ వచ్చేవారమే ఇంటికి తిరిగొస్తుందని అన్నాడు. సెమీ-ఫైనల్స్ నుంచి నిష్క్రమిస్తుందని పేర్కొన్నాడు. ‘‘ ఈ వారమే పాకిస్తాన్ ఇంటికొస్తుందని ముందే చెప్పాను. అదే జరగబోతోంది. ఇండియా కూడా అంతే. వచ్చేవారమే ఇంటికొస్తుంది. సెమీ-ఫైనల్స్ ఆడి తిరిగొచ్చేస్తారు. భారతేమీ తీస్‌మార్ ఖాన్ జట్టు కాదు. పాక్‌తో సమానమే’’ అని అక్తర్ వ్యాఖ్యానించాడు.

Shoaib Akhtar fire on Pakistan captain

Shoaib Akhtar fire on Pakistan captain

Shoaib Akhtar : ఇంత కోపం ఎందుకు..

బాబర్ బ్యాటింగ్ ఆర్డర్‌తో సహా పాకిస్థాన్ పలు విషయాలపై దృష్టి పెట్టాలని అక్తర్ సూచించాడు. “బాబర్ వన్ డౌన్ బ్యాటింగ్ చేయాలి. షాహీన్ షా అఫ్రిది ఫిట్‌నెస్‌లో ప్రధాన లోపం. కెప్టెన్సీలో కూడా లోపం ఉంది” అని చెప్పాడు. ఈ ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లతో మీరు మ్యాచులేం గెలుస్తారు. పాక్‌కి ఓ చెత్త కెప్టెన్ దొరికాడు. రెండో గేమ్‌లోనే పాకిస్తాన్, వరల్డ్ కప్ నుంచి నిష్కమించింది. మరీ జింబాబ్వేతో మ్యాచ్ ఓడిపోతారని ఎవరు మాత్రం అనుకుంటారు. ఫకార్ జమాన్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చెబెడుతున్నారు. అతని అనుభవాన్ని వాడుకోవడం లేదు.పాకిస్థాన్ తన తదుపరి సూపర్ 12 మ్యాచ్‌లో ఆదివారం నెదర్లాండ్స్‌తో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఒక పరుగు తేడాతో జింబాబ్వే చేతిలో ఓడిపోయింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది