SRH Vs DC Match ; ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హవా మాములుగా లేదు. భీబత్సమైన బ్యాటింగ్‌తో బౌలర్ల గుండెలలో దడ పుట్టిస్తున్నారు. 200కి పైగా పరుగులు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో బౌండరీల వర్షం కురిసింది. శనివారం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానం వేదికగా జరిగిన ఈ హైస్కోరింగ్ గేమ్‌లోఇరు జట్ల ఆటగాళ్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో మొత్తం 71 బౌండరీలు నమోదయ్యాయి. ఇందులో 40 ఫోర్లు, 31 సిక్సర్లు ఉండటం విశేషం. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో ఇన్ని బౌండరీలు నమోదవ్వడం ఇది రెండో సారిగా చెప్పవచ్చు. సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో 81 బౌండరీలు నమోదయ్యాయి.
మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యఛేదనలో దిల్లీ 19.1 ఓవర్లలో 199 పరుగులు చేసింది.. జేక్ ఫ్రేజర్ (18 బంతుల్లో 65, 5 ఫోర్లు, 7 సిక్స్ లు ), అభిషేక్ పోరెల్ ( 22 బంతుల్లో 42, 7 ఫోర్లు, ఒక సిక్స్) క్రీజులో ఉన్నంతసేపు సన్‌రైజర్స్ బౌలర్స్‌కి కూడా చుక్కలు చూపించారు.మరోవైపు రిషబ్ పంత్ (34 బంతుల్లో 44, 5 ఫోర్లు, ఒక సిక్స్) చాలా సేపు క్రీజులో ఉన్నా దూకుడుగా ఆడలేకపోయాడు. ఇక మిగతా బ్యాట్స్‌మెన్స్ పెద్దగా రాణించకపోవడం ఢిల్లీకి ఓటమి తప్పలేదు.
అయితే తాజా మ్యాచ్‌లో బ్యాటర్ల విధ్వంసంతో బౌండరీల బయట ఉండి బాల్స్ అందించే బాల్ బాయ్స్ రక్షణ కోసం హెల్మెట్స్ ధరించారు. మైదానంలోని ప్రతీ బాల్ బాయ్స్ హెల్మెంట్ ధరించడం అందరిని ఆశ్చర్యపరచింది. సన్‌రైజర్స్ బ్యాటర్స్ దాడికి ఆ మాత్రం ధరించకపోతే ఎలా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. క్రికెట్ పూర్తిగా బ్యాటర్ల గేమ్‌గా మారిపోయిందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/55) నాలుగు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.