SRH Vs DC Match : స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్స్‌కి భ‌య‌ప‌డి హెల్మెట్స్ ధ‌రించిన బాల్ బాయ్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SRH Vs DC Match : స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్స్‌కి భ‌య‌ప‌డి హెల్మెట్స్ ధ‌రించిన బాల్ బాయ్స్

 Authored By ramu | The Telugu News | Updated on :21 April 2024,11:00 am

SRH Vs DC Match ; ఐపీఎల్ 2024లో స‌న్‌రైజ‌ర్స్ హ‌వా మాములుగా లేదు. భీబ‌త్స‌మైన బ్యాటింగ్‌తో బౌలర్ల గుండెల‌లో ద‌డ పుట్టిస్తున్నారు. 200కి పైగా ప‌రుగులు చేస్తూ అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. తాజాగా హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో బౌండరీల వర్షం కురిసింది. శనివారం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానం వేదికగా జరిగిన ఈ హైస్కోరింగ్ గేమ్‌లోఇరు జట్ల ఆటగాళ్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగ‌డంతో మొత్తం 71 బౌండరీలు నమోదయ్యాయి. ఇందులో 40 ఫోర్లు, 31 సిక్సర్లు ఉండటం విశేషం. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో ఇన్ని బౌండరీలు నమోదవ్వడం ఇది రెండో సారిగా చెప్ప‌వ‌చ్చు. సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో 81 బౌండరీలు నమోదయ్యాయి.

SRH Vs DC Match : బ్యాట‌ర్ల దాడి

మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంత‌రం భారీ లక్ష్యఛేదనలో దిల్లీ 19.1 ఓవర్లలో 199 పరుగులు చేసింది.. జేక్ ఫ్రేజర్‌ (18 బంతుల్లో 65, 5 ఫోర్లు, 7 సిక్స్ లు ), అభిషేక్‌ పోరెల్‌ ( 22 బంతుల్లో 42, 7 ఫోర్లు, ఒక సిక్స్) క్రీజులో ఉన్నంతసేపు స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్స్‌కి కూడా చుక్క‌లు చూపించారు.మరోవైపు రిషబ్‌ పంత్‌ (34 బంతుల్లో 44, 5 ఫోర్లు, ఒక సిక్స్) చాలా సేపు క్రీజులో ఉన్నా దూకుడుగా ఆడలేకపోయాడు. ఇక మిగ‌తా బ్యాట్స్‌మెన్స్ పెద్ద‌గా రాణించ‌క‌పోవ‌డం ఢిల్లీకి ఓట‌మి త‌ప్ప‌లేదు.

SRH Vs DC Match స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్స్‌కి భ‌య‌ప‌డి హెల్మెట్స్ ధ‌రించిన బాల్ బాయ్స్

SRH Vs DC Match : స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్స్‌కి భ‌య‌ప‌డి హెల్మెట్స్ ధ‌రించిన బాల్ బాయ్స్

అయితే తాజా మ్యాచ్‌లో బ్యాటర్ల విధ్వంసంతో బౌండరీల బయట ఉండి బాల్స్ అందించే బాల్ బాయ్స్ రక్షణ కోసం హెల్మెట్స్ ధరించారు. మైదానంలోని ప్రతీ బాల్ బాయ్స్ హెల్మెంట్ ధరించ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్స్ దాడికి ఆ మాత్రం ధ‌రించ‌క‌పోతే ఎలా అంటూ కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. క్రికెట్ పూర్తిగా బ్యాటర్ల గేమ్‌గా మారిపోయిందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/55) నాలుగు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది