Suresh Raina : పుష్పకి ఫ్లాట్ అయిన సురేష్ రైనా… ఈ బ్యాటింగ్ స్టెప్పులేందయ్యా..!
Suresh Raina : పాన్ ఇండియా మూవీగా వచ్చిన అల్లు అర్జున్ పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో కన్నా ఈ సినిమా హిందీలో మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీకి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఈ మూవీపై ప్రేమ కురిపిస్తున్నారు. ఎప్పడు లేని విధంగా క్రికెటర్స్ సినిమాలోని పాటలకు, డైలాగ్స్‌కి రీల్స్ చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటికే శిఖర్ ధావన్, జడేజా, వార్నర్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి వారు పుష్ప సినిమాలోని పాటలకు సందడి చేయగా, ఇప్పుడు రైనా కూడా వారి జాబితాలో చేరాడు.
భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇటీవల సినిమాలోని తగ్గేదే లే అనే డైలాగ్‌తో రచ్చ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ‘శ్రీ వల్లీ’ సాంగ్‌కు స్టెప్పులు వేసి నెట్టింట్లో వైరలవుతున్నాడు. తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి వినూత్నంగా స్టెప్పులు వేశాడు. చివరలో బ్యాటింగ్ చేస్తున్నట్టు కనిపించాడు. రైనా స్టెప్పులకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. అయితే రైనా మాత్రం నా స్టైల్‌లో నేను ట్రై చేశాను. సూపర్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నావు అల్లుఅర్జున్ బ్రదర్. భారీ విజయం దక్కాలని కోరకుంటున్నాను అంటూ క్యాప్షన్‌తో ఈ వీడియోను ఇన్‌స్టాలో విడుదల చేశాడు.

Suresh Raina flat to Pushpa Batting steps
Suresh Raina : సురేష్ రైనా తగ్గేదే లే అంటున్నాడే..
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) పోటీల్లో సిల్హెట్ సన్ రైజర్స్ టీమ్ కు చెందిన నజ్ముల్ హుస్సేన్ అపు వికెట్ తీయగానే, అల్లు అర్జున్ లా ‘తగ్గేదే లే’ అంటూ గడ్డం కింద నుంచి చేయి పోనిచ్చి సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఏదేమైన క్రికెటర్లు సైతం బన్నీలా ‘తగ్గేదే లే’ అంటూ అలరిస్తున్నారు. డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది పుష్ప. ప్రస్తుతం ఈ చిత్రం ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
View this post on Instagram