India vs Bangladesh : వర్ష.. DLS.. మళ్ళీ మొదలు.. 16 ఓవర్ల మ్యాచ్ .. క్షణక్షణం ఉత్కంఠ తో ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్..!!
India vs Bangladesh : T20 వరల్డ్ కప్ టోర్నీలో వర్షం కారణంగా భారత్ బంగ్లా మ్యాచ్ నిలిచిపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది. దీంతో బరిలోకి దిగిన భారత్.. బంగాళాఖాతం 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. ఇక రెండో బ్యాటింగ్ 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మొదటి నుంచి దూకుడుగా ఆడింది. ఏడూ ఓవర్లు పూర్తి అయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది.
ఇందులో ఓపెనర్ లిట్టన్ దాస్ 59 పరుగులు చేశారు. 26 బంతుల్లో 7 ఫోర్ లు మరియు మూడు సిక్స్ లతో చెలరేగిపోయాడు. మరో ఓపెనర్ నజ్ముల్ శాంటో 16 బంతుల్లో ఏడు పరుగులు చేయడం జరిగింది. ఇక ఎనిమిదవ ఓవర్ ఒక బంతి వేయకముందే వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఈ క్రమంలో ఒకవేళ తిరిగి మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటే మొదలైన ఓవర్లను కుదించి ఆట కొనసాగిస్తారు.
ఇక వర్షం కుండపోతగా పడుతూ మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోతే డక్ వర్త్ లూయిస్ ప్రకారం విజేతను నిర్ణయిస్తారు. ఇలా అయితే బంగ్లాదేశ్ విజయం సాధించినట్లే. డక్ వర్త్ లూయిస్ ప్రకారం మొదటి ఏడోవర్లలో 49 పరుగులు చేయాల్సి ఉంటుంది. అయితే అనుకున్న లక్ష్యం కంటే 66 పరుగులు బంగ్లాదేశ్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ మ్యాచ్ మొదలు కావటంతో నాలుగు ఒవర్స్ తగ్గించి మొత్తానికి 16 ఓవర్స్..కి కుదిరించడం జరిగింది. దీంతో 9 ఓవర్లలో బంగ్లాదేశ్ 85 పరుగులు చేయాల్సి ఉంది.