Rohit Sharma : ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా Australiaతో జరుగుతున్న ఐదో టెస్ట్‌కి కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. సిడ్నీ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఐదో టెస్ట్ నుంచి రోహిత్ స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. దాంతో జస్‌ప్రీత్ బుమ్రా సారథిగా జట్టును నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.రోహిత్ శర్మ స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో శుభ్‌మన్ గిల్‌కి అవకాశం లభించింది. రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా Bumrah సిడ్నీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో అతని కెప్టెన్సీలోనే భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత, తదుపరి మూడు టెస్టులకు రోహిత్ Rohit Sharma కెప్టెన్‌గా వ్యవహరించగా, టీమిండియా 2 టెస్టుల్లో ఓడిపోగా, ఒక మ్యాచ్ డ్రా అయింది.
జట్టు మేలు కోరే రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని టాస్ సందర్భంగా జస్‌ప్రీత్ బుమ్రా తెలిపాడు. ‘ఈ సిరీస్‌లో మేం అద్బుతమైన క్రికెట్ ఆడాం. గత మ్యాచ్ చాలా ఉత్సాహంగా సాగింది. ఈ మ్యాచ్‌లో మేం మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నాం. పిచ్‌పై కాస్త గడ్డి ఉంది. కొత్త బంతితో బ్యాటర్లకు సవాల్ ఎదురవ్వనుంది అని బుమ్రా(Bumrah) చెప్పుకొచ్చారు. అయితే రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఇలా రెస్ట్ తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఐసీసీ టోర్నీలను గెలుచుకున్న భారత కెప్టెన్లు కొందరే ఉన్నారు. వారిలో రోహిత్ శర్మ కూడా ఒకడిగా పేరుగాంచాడు. కొద్ది రోజుల క్రితం కెప్టెన్సీలో భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు, అతను యావత్ దేశానికే హీరో అయ్యాడు.
రోహిత్ శర్మని ఆకాశానికి ఎత్తారు. అలాంటి రోహిత్ శర్మ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. టీ20 ప్రపంచ కప్ T20 World Cup నుంచి అతని బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు. లేదా అతని కెప్టెన్సీలో జట్టు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ జట్టు నుంచి తప్పుకోవడానికి ఇదే కారణంగా నిలిచింది. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత అతను క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు. శ్రీలంక Srilanka పర్యటనలో 3-మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 52.33 సగటుతో 157 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత భారత జట్టు టెస్ట్ సీజన్ ప్రారంభమైంది. అయితే, ప్రతి టెస్టు మ్యాచ్‌లోనూ ఫ్లాప్ అయ్యాడు. టీ20 ప్రపంచ కప్ తర్వాత, రోహిత్ బంగ్లాదేశ్‌తో 2 టెస్టులు, న్యూజిలాండ్‌తో 3 టెస్టులు, ఇప్పుడు ఆస్ట్రేలియాతో 3 టెస్టులు ఆడాడు. అయితే ఈ వ్యవధిలో అతను ఒక్కసారి మాత్రమే 50 పరుగుల మార్కును తాకగలిగాడు.బ్యాటింగ్‌లోనే కాకుండా కెప్టెన్సీలో కూడా ఫ్లాప్‌గా నిలిచాడు.
Gajakesari Yoga : జ్యోతిష్య శాస్త్రం Gajakesari Yoga ప్రకారం నవగ్రహాలు మనుషులు తమ జీవితంలో చేసిన కర్మ ఫలాలను,…
Soybean : సోయాబీన్ లేదా సోయా బిన్ ( గ్లైసిన్ మాక్స్ ) Soybean అనేది తూర్పు ఆసియా కు…
Earthquake : ఇటీవల భూప్రకంపనలు ప్రజలకి వణుకు పుట్టిస్తున్నాయి. New Delhi ఢిల్లీ-ఎన్సీఆర్, bihar Earthquake సహా దేశంలోని పలు…
Railway Recruitment 2025 : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) వివిధ ట్రేడ్లలో అప్రెంటీస్ పోస్టుల కోసం 4,232 ఖాళీలను…
Budhaditya Rajyoga :గ్రహాలకు రాకుమారుడు అయిన బుధుడు, తెలివితేటలకు, తార్కానికి, పెట్టుబడి వ్యాపారులకు కారణంగా పరిగణించబడే బుధుడు యొక్క ప్రభావం…
Anasuya Bharadwaj : స్టార్ యాంకర్ అనసూయ Anchor Anasuya Bharadwaj ఏం చేసినా సరే దానికో స్పెషాలిటీ ఉంటుంది.…
Amala Paul : తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో కథానాయికగా నటించి పేరు తెచ్చుకున్న నటి అమలా పాల్ తల్లైన…
Daku Maharaaj : నందమూరి బాలకృష్ణ Balakrishna నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా…
This website uses cookies.