Rohit Sharma : చెత్త రికార్డ్ బీట్ చేసిన రోహిత్ శర్మ.. కొత్త కెప్టెన్ రావాల్సిన టైమ్ వచ్చింది..!
ప్రధానాంశాలు:
Rohit Sharma : చెత్త రికార్డ్ బీట్ చేసిన రోహిత్ శర్మ.. కొత్త కెప్టెన్ రావాల్సిన టైమ్ వచ్చింది..!
Rohit Sharma : గత కొద్ది రోజులుగా రోహిత్ శర్మ Rohit Sharma , విరాట్ కోహ్లీ virat kohli పర్‌ఫార్మెన్స్ నిరాశ పరుస్తుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో భారత్ క్రికెట్ జట్టు దిగ్విజయంగా వైఫల్యాల పరంపరను కొనసాగిస్తోంది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన నాలుగవ టెస్ట్ లో రోహిత్ సేన 184 పరుగుల భారీ తేడాతో మరో పరాభవాన్ని మూట కట్టుకున్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ లో ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసి) ఫైనల్ బెర్త్ ను సంక్లిష్టం చేసుకుంది భారత జట్టు. నాలుగో టెస్ట్ లో కూడా భారత జట్టు ఓటమి చెందడంతో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లుగా ప్రచారాలు సాగుతున్నాయి.
Rohit Sharma బుమ్రాకే నాయకత్వం..
బుమ్రా నాయకత్వంలో తొలి టెస్ట్ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత రోహిత్ శర్మ రావడంతో వరుస పరాజయాలు నమోదు చేసుకుంది. ఈ క్రమంలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.సిడ్నీలో జరిగే చివరి టెస్ట్ అనంతరం రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నాడని అంటున్నారు. ఆస్ట్రేలియా టూర్‌లో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ విఫలం కావడంతోపాటు, సారథిగా కూడా జట్టును గెలిపించడంలో విఫలం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో సారథిగా రోహిత్‌ను తప్పించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కోట్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఇక తాను చెప్పినట్లే ఆడాలని టీం సభ్యులకు దిశానిర్దేశం చేశాడు. మరోవైపు మెల్‌బోర్న్ టెస్టుకు సారథిగా బుమ్రాను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
రోహిత్ చివరి టెస్ట్ అడతాడా లేదా అనేది చర్చ జరిగింది. అయితే గంభీర్ మాత్రం రోహిత్ ఆడతాడని స్పష్టం చేశాడు. “రోహిత్‌తో అంతా బాగానే ఉంది. చివరి టెస్ట్ లో రోహిత్ ఆడతాడు” అని గంభీర్ పేర్కొన్నాడు. చివరి టెస్ట్ లో ఎవరు ఆడబోతున్నారని ప్రశ్నకు బదులిస్తూ ” మేము వికెట్‌ని పరిశీలించి, మా ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటిస్తామని చెప్పాడు. రోహిత్ ఆడని పక్షంలో గిల్ తుది గెట్టిలోకి రీఎంట్రీ ఇవ్వనుండగా.. కెప్టెన్సీ బాధ్యతలను బూమ్రాకి అప్పగించే అవకాశం ఉంది. జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయగా.. మూడవ స్థానంలో గిల్ బ్యాటింగ్ కి దిగుతాడు. ఇక సిడ్ని పిచ్ స్పిన్ కి అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు కోహ్లీని కూడా ఈ టెస్ట్ నుంచి పక్కకు పెట్టాలని యోచిస్తున్నారట. కాగా, రోహిత్ సారథ్యంలో టీమిండియా 14 మ్యాచ్‌లలో 6 ఓడిపోయింది. దీంతో భారత టెస్టు చరిత్రలో చెత్తికార్డుల్లో ఒకడిగా నిలిచాడు. ఏడాదిలో టీమిండియాకు ఎక్కువ ఓటములు తెచ్చి పెట్టిన కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు.