Team India missed again Sanju Samson
Sanju Samson: టీమిండియా ఆటగాళ్లకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆడని ఆటగాళ్లకు పదే పదే ఛాన్స్ లు ఇవ్వడం పట్ల కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండగా, ఇందుకోసం భారత్ ఇప్పటి నుంచే కసరత్తులు ఆరంభించింది. ఈ క్రమంలోనే వెంట వెంటనే వన్డే సిరీస్ లు ఆడుతుంది.ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్.. వన్డే సిరీస్ పూర్తి కాగానే బంగ్లాదేశ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ తో పాటు రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఆడనుంది.
అయితే టీమిండియాలో సుస్థిరమైన స్థానం కోసం సంజూ సామ్సన్ గత కొంత కాలంగా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతిభకు ఏ లోటు లేని ఈ ప్లేయర్ టీమిండియా మేనేజ్ మెంట్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలకు ప్రతిసారి బలవుతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికైన ఇతడికి టి20 సిరీస్ లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఇక వన్డే సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో సంజూ సామ్సన్ ఆకట్టుకునే విధంగా 36 పరుగలు చేశాడు. ఇదే మ్యాచ్ లో రిషభ్ పంత్ కేవలం 15 పరుగులకే ఔట్ అయ్యాడు. అయినప్పటికీ అతనికే అవకాశలు ఇస్తున్నారు. సంజూ సామ్సన్ కు వరుసగా ఒక 10 మ్యాచ్ లు ఆడే అవకాశం
Team India missed again Sanju Samson
ఇవ్వాలంటూ టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో రెండో మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ను మళ్లీ తొలగించి అతని స్థానంలో దీపక్ హుడాకు అవకాశం కల్పించారు. అలాగే, గత మ్యాచ్‌లో చాలా భారీగా పరుగులు ఇచ్చిన షార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. శార్దూల్‌ను తప్పించడం సమంజసమే అయినా మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న సంజూను రెండో వన్డే నుంచి తప్పించడం తో అభిమానులు మండిపడుతున్నారు. ఫామ్‌లోనే పంత్‌ని ఆడించి శాంసన్ పై ఎందుకు వేటు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజూ శాంసన్ గత 4 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 86*, 30*, 2*, 36 పరుగులు చేసిన పాపం ఆయనకే ఎందుకిలా జరుగుతుంది అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.