Sanju Samson : సంజూ శాంసన్ ను మ‌ళ్లీ త‌ప్పించిన టీమిండియా.. రిషభ్ పంత్‌కు ఇన్ని చాన్స్‌లా.. ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హాం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sanju Samson : సంజూ శాంసన్ ను మ‌ళ్లీ త‌ప్పించిన టీమిండియా.. రిషభ్ పంత్‌కు ఇన్ని చాన్స్‌లా.. ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హాం..!

 Authored By sandeep | The Telugu News | Updated on :27 November 2022,3:00 pm

Sanju Samson: టీమిండియా ఆట‌గాళ్ల‌కు సంబంధించిన కొన్ని నిర్ణ‌యాలు అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. ఆడ‌ని ఆట‌గాళ్లకు ప‌దే ప‌దే ఛాన్స్ లు ఇవ్వ‌డం ప‌ట్ల కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండ‌గా, ఇందుకోసం భారత్ ఇప్పటి నుంచే కసరత్తులు ఆరంభించింది. ఈ క్రమంలోనే వెంట వెంటనే వన్డే సిరీస్ లు ఆడుతుంది.ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్.. వన్డే సిరీస్ పూర్తి కాగానే బంగ్లాదేశ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ తో పాటు రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఆడనుంది.

అయితే టీమిండియాలో సుస్థిరమైన స్థానం కోసం సంజూ సామ్సన్ గత కొంత కాలంగా ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతిభకు ఏ లోటు లేని ఈ ప్లేయర్ టీమిండియా మేనేజ్ మెంట్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలకు ప్ర‌తిసారి బలవుతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికైన ఇతడికి టి20 సిరీస్ లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఇక వన్డే సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో సంజూ సామ్సన్ ఆకట్టుకునే విధంగా 36 పరుగలు చేశాడు. ఇదే మ్యాచ్ లో రిషభ్ పంత్ కేవలం 15 పరుగులకే ఔట్ అయ్యాడు. అయిన‌ప్ప‌టికీ అత‌నికే అవ‌కాశ‌లు ఇస్తున్నారు. సంజూ సామ్సన్ కు వరుసగా ఒక 10 మ్యాచ్ లు ఆడే అవకాశం

Team India missed again Sanju Samson

Team India missed again Sanju Samson

Sanju Samson : ఎందుకిలా క‌క్ష‌..!

ఇవ్వాలంటూ టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిఇటీవ‌ల పేర్కొన్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో రెండో మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ను మళ్లీ తొలగించి అతని స్థానంలో దీపక్ హుడాకు అవకాశం క‌ల్పించారు. అలాగే, గత మ్యాచ్‌లో చాలా భారీగా పరుగులు ఇచ్చిన షార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్‌ జట్టులో స్థానం ద‌క్కించుకున్నాడు. శార్దూల్‌ను తప్పించడం సమంజసమే అయినా మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న సంజూను రెండో వన్డే నుంచి తప్పించడం తో అభిమానులు మండిప‌డుతున్నారు. ఫామ్‌లోనే పంత్‌ని ఆడించి శాంస‌న్ పై ఎందుకు వేటు వేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సంజూ శాంసన్ గత 4 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 86*, 30*, 2*, 36 పరుగులు చేసిన పాపం ఆయ‌న‌కే ఎందుకిలా జ‌రుగుతుంది అని ఫ్యాన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది