team india netizens satirical posts on indian cricketers
Team India : దుబాయ్ వేదికగా సండే నైట్ జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్ రెండిటిలోనూ భారత్ నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు భారత క్రికెటర్లకు చురకలు అంటిస్తున్నారు.కివీస్ చేతిలో ఓడిపోయినందుకుగాను టీమిండియాపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. క్రికెటర్స్ మీమ్స్‌తో విమర్శలు చేస్తున్నారు. మొదటి ఓవర్ నుంచి చివరి ఓవర్ వరకు భారత ఆటగాళ్లు కనీస పోటిని ఇవ్వలేకపోయారని నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు.
team india netizens satirical posts on indian cricketers
వరుస పరాజయాలతో భారత్ సంక్లిష్ట స్థితికి చేరుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో టాస్‌లో విరాట్ కోహ్లీ టాస్ ఓడిపోయాడు. అలా ఫస్ట్ బ్యాటింగ్ ఇండియానే చేయాల్సి వచ్చింది. ఏడు వికెట్ల నష్టానికి 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా. రవీంద్ర జడేజా 26 నాటౌట్‌గా, టాప్ స్కోరర్‌గా నిలవగా, రోహిత్ శర్మ (14), రాహుల్(18) విరాట్ కోహ్లీ (9), హార్దిక్ పాండ్యా (23), రిషబ్ పంత్ (12) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో భారత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (4) ఒక్క బౌండరీతో సరిపెట్టాడు.భువీ ప్లేస్‌లో వచ్చిన శార్ధూల్ ఠాకూర్ డకౌటయ్యాడు. మొత్తంగా టీమిండియాలో ఒక్క ఆటగాడు కూడా బ్యాటింగ్ సరిగా చేయలేకపోయాడు. అలా ఇన్నింగ్స్‌లో పేలవ పర్ఫార్మెన్స్ ఇచ్చారు భారత ఆటగాళ్లు. కాగా, అదే పిచ్‌పై న్యూజిలాండ్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఈ క్రమంలోనే నెటిజన్లు భారత ఆటగాళ్లను ఉద్దేశించి రకరకాల మీమ్స్ క్రియేట్ చేశారు.
team india netizens satirical posts on indian cricketers
వాటిని పోస్ట్ చేసి ఆటగాళ్లను విమర్శిస్తున్నారు. న్యూజిలాండ్ ఆటగాళ్లు ఆడగలిగినప్పుడు ఇండియా క్రికెటర్స్‌కు ఏమైందనే ప్రశ్నను వాళ్లు వేస్తున్నారు. టీమిండియా ఫస్ట్ మ్యాచ్‌లో దాయాది దేశమైన పాకిస్థాన్ చేతిలో పది వికెట్ల తేడాలో ఓడిపోయిన విషయం అందరికీ విదితమే. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోవడం క్రికెట్ అభిమానుల్ని మరోసారి నిరాశపరిచింది.
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
This website uses cookies.