
ENG vs SA ODI Umpire marais erasmus gets trolled by netizens
ENG vs SA ODI Umpire : క్రికెట్‌లో ఒక్కోసారి విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. క్రీడా కారులు, ప్రేక్షకులు, అంపైర్స్ విచిత్ర చేష్టలతో వార్తలలో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఓ అంపైర్ మ్యాచ్ మధ్యలో చేసిన పని హాట్ టాపిక్‌గా మారింది. సౌతాఫ్రికా – ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో సీనియర్ అంపైర్ అయిన మరాయిస్ ఎరాస్మస్ మైదానంలో ప్రవర్తించిన తీరుపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.. ఆటను పట్టించుకోకుండా ఎరాస్మస్ తన పనిని తాను చేసుకోవడం టీవీ కెమెరాల్లో కనిపించడంతో, దీనిపై నెటిజన్లు ఎరాస్మస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. మ్యాచ్ జరుగుతుందనే విషయాన్ని ఎరాస్మస్ మరిచిపోయినట్లున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు.
siraj makes fun with umpire
నాకు సంబంధం లేదు.. ఈ సంఘటన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా 24వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రీజులో జేసన్ రాయ్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఎరాస్మస్ లెగ్ అంపైర్‌గా ఉండి, ఆటను గమనించకుండా పక్కకు జరిగి తన పనిని తాను చేసుకున్నాడు. ఆటతో తనకు సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తించడం అందరిని ఆశ్చర్యపరచింది. ఈ విషయంపై నెటిజన్స్ కొందరు తమ కామెంట్స్ లో వన్డేలను ఎవడు చూస్తాడని ఎరాస్మస్ ఫీలింగ్ అని ఒకరంటే.. థర్డ్ అంపైర్ చూసుకుంటాడులే అనే భరోసా ఎరాస్మస్‌కు ఉందని అనుకుంటా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ పై సౌతాఫ్రికా 27 పరుగుల తేడాతో గెలుపొందింది.
ENG vs SA ODI Umpire marais erasmus gets trolled by netizens
ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేయగా, సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ లో వాండర్ డుసెన్(117 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 111) సెంచరీతో చెలరేగగా.. డేవిడ్ మిల్లర్(53) హాఫ్ సెంచరీతో మంచి ఆటతీరు కనబరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, ఒల్లీ స్టోన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక ఇంగ్లడ్ 44.2 ఓవర్లలో 271 పరుగులకు కుప్పకూలింది. జాసన్ రాయ్(91 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113) సెంచరీ, డేవిడ్ మలాన్(59) హాఫ్ సెంచరీ తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.