ENG vs SA ODI Umpire : మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ప‌ట్టించుకోకుండా దిక్కులు చూసిన అంపైర్.. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ENG vs SA ODI Umpire : మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ప‌ట్టించుకోకుండా దిక్కులు చూసిన అంపైర్.. !

 Authored By prabhas | The Telugu News | Updated on :29 January 2023,5:20 pm

ENG vs SA ODI Umpire : క్రికెట్‌లో ఒక్కోసారి విచిత్ర సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూ ఉంటాయి. క్రీడా కారులు, ప్రేక్ష‌కులు, అంపైర్స్ విచిత్ర చేష్ట‌ల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఓ అంపైర్ మ్యాచ్ మ‌ధ్య‌లో చేసిన ప‌ని హాట్ టాపిక్‌గా మారింది. సౌతాఫ్రికా – ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో సీనియర్ అంపైర్ అయిన మరాయిస్ ఎరాస్మస్ మైదానంలో ప్రవర్తించిన తీరుపై సర్వత్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.. ఆటను పట్టించుకోకుండా ఎరాస్మస్ తన పనిని తాను చేసుకోవడం టీవీ కెమెరాల్లో కనిపించ‌డంతో, దీనిపై నెటిజన్లు ఎరాస్మస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. మ్యాచ్ జరుగుతుందనే విషయాన్ని ఎరాస్మస్ మరిచిపోయినట్లున్నాడని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

siraj makes fun with umpire

siraj makes fun with umpire

నాకు సంబంధం లేదు.. ఈ సంఘ‌ట‌న ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా 24వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రీజులో జేసన్ రాయ్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఎరాస్మస్ లెగ్ అంపైర్‌గా ఉండి, ఆటను గమనించకుండా పక్కకు జరిగి తన పనిని తాను చేసుకున్నాడు. ఆటతో తనకు సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తించడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఈ విష‌యంపై నెటిజ‌న్స్ కొంద‌రు త‌మ కామెంట్స్ లో వన్డేలను ఎవడు చూస్తాడని ఎరాస్మస్ ఫీలింగ్ అని ఒకరంటే.. థర్డ్ అంపైర్‌ చూసుకుంటాడులే అనే భరోసా ఎరాస్మస్‌కు ఉంద‌ని అనుకుంటా అని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఇంగ్లండ్ పై సౌతాఫ్రికా 27 పరుగుల తేడాతో గెలుపొందింది.

ENG vs SA ODI Umpire marais erasmus gets trolled by netizens

ENG vs SA ODI Umpire marais erasmus gets trolled by netizens

ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేయ‌గా, సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ లో వాండర్ డుసెన్(117 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 111) సెంచరీతో చెలరేగగా.. డేవిడ్ మిల్లర్(53) హాఫ్ సెంచరీతో మంచి ఆట‌తీరు క‌న‌బ‌రిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, ఒల్లీ స్టోన్ తలో వికెట్ ద‌క్కించుకున్నారు. ఇక ఇంగ్లడ్ 44.2 ఓవర్లలో 271 పరుగులకు కుప్పకూలింది. జాసన్ రాయ్(91 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113) సెంచరీ, డేవిడ్ మలాన్(59) హాఫ్ సెంచరీ త‌ప్ప మిగ‌తా బ్యాట్స్‌మెన్ రాణించ‌లేక‌పోయారు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది