Vaibhav Suryavanshi : 14 ఏళ్లకే ఆరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్.. చిట్టి ల‌య‌న్ డేంజ‌రే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vaibhav Suryavanshi : 14 ఏళ్లకే ఆరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్.. చిట్టి ల‌య‌న్ డేంజ‌రే..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 April 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Vaibhav Suryavanshi : 14 ఏళ్లకే ఆరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్.. చిట్టి ల‌య‌న్ డేంజ‌రే..!

Vaibhav Suryavanshi : లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన‌ మ్యాచులో టీనేజ్‌ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసు (14 ఏళ్ల 23 రోజులు)లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అత‌ను తొలి మ్యాచ్ ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా మ‌లుచుకున్నాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతిని సిక్స్‌గా మ‌లిచి అభిమానుల‌ని అల‌రించాడు. శార్దూల్ వేసిన బంతిని కవర్స్ మీదుగా బాది అద్భుతమైన సిక్సుగా మ‌ల‌వ‌డంతో సిక్సర్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన పిన్న వయస్కుడిగా నిలిచాడు.

Vaibhav Suryavanshi 14 ఏళ్లకే ఆరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్ చిట్టి ల‌య‌న్ డేంజ‌రే

Vaibhav Suryavanshi : 14 ఏళ్లకే ఆరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్.. చిట్టి ల‌య‌న్ డేంజ‌రే..!

Vaibhav Suryavanshi : వారెవ్వా.. అదుర్స్..

ఆ త‌ర్వాత మూడో బంతిని కూడా సిక్స్ బాది అదరగొట్టాడు. ఈ మ్యాచులో వైభవ్ సూర్యవంశీ పైకి కామ్ గా కనపడుతూనే ఎంతో ధైర్యంగా బ్యాటింగ్ చేశాడు. తన బ్యాటును ఝళిపించి.. ప్రతీ బంతిని బలంగా బాదాడు. 20 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 34 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మార్ క్రమ్ బౌలింగ్ లో 8.4 ఓవర్ వద్ద వికెట్ కీపర్ రిషభ్ పంత్.. అతడి స్టంపౌట్ చేశాడు. అయితే అతడి ప్రదర్శనతో మంత్రముగ్ధులైన క్రికెట్ అభిమానులంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

2008లో ఐపీఎల్ ప్రారంభ సమయానికి వైభవ్ ఇంకా పుట్టనేలేదు. సూర్యవంశీది రైతు కుటుంబం. అతడి తండ్రి ఒక రైతు. అయితే వంశీ నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ బ్యాట్ ప‌ట్టిన అత‌ను అండర్-16 ఆడాడు. అనంతరం ఈ ఏడాది చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన భారత్ అండర్-19 యూత్ టెస్టులోనూ అదిరే ప్రదర్శన చేశాడు. 62 బంతుల్లో 104 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకున్నాడు. అండర్‌-19 టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది