Bangalore Stampede : బిగ్ బ్రేకింగ్‌.. ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట.. ఆరుగురు మృతి..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2025,6:06 pm

ప్రధానాంశాలు:

  •  Bangalore Stampede : ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట.. ఆరుగురు మృతి..!

Bangalore Stampede : ఐపీఎల్ 2025 సీజన్ విజయం నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) చేపట్టిన విక్టరీ పరేడ్‌లో అపశృతి చోటు చేసుకుంది. తొక్కిసలాట‌లో ఏడుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. మరో 25 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో‌కి అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో పోలీసులు వారిని కట్టడి చేయలేకపోయారు.

Bangalore Stampede : బిగ్ బ్రేకింగ్‌.. ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట.. ఆరుగురు మృతి..!

Bangalore Stampede : బిగ్ బ్రేకింగ్‌.. ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట.. ఆరుగురు మృతి..!

Bangalore Stampede : ఈ ఘటనలో పలువురు ఫ్యాన్స్ గాయపడగా.. ఆరుగురు  మృతి చెందినట్లు సమాచారం

తొలుత ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని ఆర్‌సీబీ విక్టరీ పరేడ్‌కు పోలీసులు అనమతి ఇవ్వలేదు. కానీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పట్టుబట్టడంతో అనుమతి ఇచ్చారు. దాంతో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్ నిర్వహిస్తామని ఆర్‌సీబీ ప్రకటించింది.

అభిమానులు నిబంధనలు పాటిస్తూ ఇందులో పాల్గొనాలని ఆర్‌సీబీ ట్వీట్ చేసింది. ఫ్రీ పాసుల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. బస్సులో ఆర్‌సీబీ ఆటగాళ్లు చిన్నస్వామి స్టేడియంకు చేరుకున్నారు. చిన్న స్వామి స్టేడియంలో ఆర్‌సీబీ ఆటగాళ్లను కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సత్కరించింది. స్టేడియంలో సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆర్‌సీబీ అభిమానులతో చిన్నస్వామి స్టేడియం కిక్కిరిసింది. తొక్కిసలాట నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి