Virat Kohli : సచిన్ రికార్డులను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు.. న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో చితక్కొట్టిన కోహ్లీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Virat Kohli : సచిన్ రికార్డులను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు.. న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో చితక్కొట్టిన కోహ్లీ  

Virat Kohli : అన్నంత పని చేశాడు విరాట్ కోహ్లీ. మొన్న 49 సెంచరీలు చేసి సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ తాజాగా న్యూజిలాండ్ మ్యాచ్ లో మరో సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేశాడు. దీంతో వన్డే మ్యాచ్ లలో 50 సెంచరీలు ఇప్పటి వరకు పూర్తయ్యాయి. 50 సెంచరీలతో సచిన్ రికార్డును బద్దలు చేసి ఇప్పటి వరకు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :15 November 2023,5:22 pm

ప్రధానాంశాలు:

  •  సచిన్ రికార్డు బద్దలు

  •  వాంఖడే స్టేడియంలో కోహ్లీ జోరు

  •  50 సెంచరీలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన కోహ్లీ

Virat Kohli : అన్నంత పని చేశాడు విరాట్ కోహ్లీ. మొన్న 49 సెంచరీలు చేసి సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ తాజాగా న్యూజిలాండ్ మ్యాచ్ లో మరో సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేశాడు. దీంతో వన్డే మ్యాచ్ లలో 50 సెంచరీలు ఇప్పటి వరకు పూర్తయ్యాయి. 50 సెంచరీలతో సచిన్ రికార్డును బద్దలు చేసి ఇప్పటి వరకు వన్డేల్లో ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా చరిత్రకెక్కాడు విరాట్ కోహ్లీ. వన్డే మ్యాచ్ లలో ఇప్పటి వరకు సచిన్ 49 సెంచరీలు చేయగా.. ఈ మ్యాచ్ లో కోహ్లీ 50 సెంచరీలు చేశాడు. భారత్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అదరగొట్టేశాడు. కోహ్లీ ఈ మ్యాచ్ లో 117 పరుగులు చేశాడు. 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు కోహ్లీ. సెంచరీ చేసి సౌతీ బౌలింగ్ లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి రికార్డు క్రియేట్ చేసి పెవిలియన్ బాట పట్టాడు.

న్యూజిలాండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో మరో జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే నేరుగా నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ లో ఫైనల్ కు అర్హత సాధించే మరో జట్టుతో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ ఫైనల్ కు చేరినట్టే. అయితే.. భారత్ గట్టిగానే ఈ మ్యాచ్ లో స్కోర్ చేస్తోంది. 45 ఓవర్లలో 340కి పైగా స్కోర్ చేసింది. వికెట్లు కూడా ఇప్పటి వరకు 2 మాత్రమే పోయాయి. అందుకే న్యూజిలాండ్ కు భారీ లక్ష్యాన్ని అందించేందుకు భారత్ చెమటోడుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది