AI+ Smartphone : రూ.5 వేలకే స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవు..!
ప్రధానాంశాలు:
AI+ Smartphone : రూ.5 వేలకే స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవు..!
AI+ Smartphone : ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫోన్ చుట్టూనే తిరుగుతంది.. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ కొనేందుకే మొగ్గు చూపుతున్నారు. కళ్లు చెదిరే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి దేశీ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ వచ్చేశాయి. నెక్ట్స్ క్వాంటమ్ షిప్ట్ టెక్నాలజీస్ పేరిట రియల్ మీ ఇండియా, హానర్ మాజీ సీఈఓ మాధవ్ సేత్ కొత్త కంపెనీ ప్రారంభించారు. ఈ సంస్థ నుంచి కొత్తగా ఏఐ + బ్రాండ్ పేరుతో రెండ్ స్మార్ట్ ఫోన్లను మంగళవారం లాంచ్ చేశారు.

AI+ Smartphone : రూ.5 వేలకే స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవు..!
AI+ Smartphone : తక్కువ ధరకే..
ఏఐ + పల్స్ (4జీ స్మార్ట్ ఫోన్), నోవా (5జీ స్మార్ట్ ఫోన్) మార్కెట్లోకి తెచ్చారు. భారత్‌ను దృష్టిలో పెట్టుకుని ఏఐ + స్మార్ట్ ఫోన్లనుతీసుకొచ్చినట్లు మాధవ్ సేథ్ ఈ సందర్భంగా తెలిపారు. బడ్జెట్ ధరలో ఉన్నా డిజైన్, వేగం, డేటా భద్రతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. ఏఐ ప్లస్ పల్స్, ఏఐ ప్లస్ నోవా రెండు ఫోన్లలోనూ 6.7 అంగుళాళ హెడ్‌డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుందని చెప్పారు. 90Hz, 120Hz రిఫ్రెష్ రేటు సపోర్ట్ చేస్తాయన్నారు. ఏఐ ప్లస్ పల్స్ ఫోన్‌లో Unisco T615, నోవా 5జీలో Unisco T8200 ప్రాసెసర్ ఉంటుందని తెలిపారు.
ఏఐ + పల్స్ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది 4GB +64GB వేరియంట్ ధర రూ.4,999గా నిర్ణయించారు. 6GB+ 128GB వేరియంట్ ధర రూ.6,999గా నిర్ణయించారు. ఇక 5జీ స్మార్ట్ ఫోన్ ఏఐ ప్లస్ నోవా సైతం రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6 GB+ 128GB వేరియంట్ ధర రూ.7,999గా ఉండగా 8GB +128GB ఫోన్ ధర రూ.9,999గా నిర్ణయించారు. ఏఐ ప్లస్ పల్స్ మోడల్ స్మార్ట్ ఫోన్ జూలై 12వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక ఏఐ ప్లస్ నోవా 5జీ ఫోన్ జూలై 13వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది.