Flipkart – Amazon : చాలామంది ఎవరైనా షాపింగ్ చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా ఆన్ లైన్ లో ఫెస్టివల్ సేల్ ఉంటే అప్పుడే కొనుక్కుందాం అని అనుకుంటారు. ఫెస్టివల్ సేల్ లో చాలా తక్కువ ధరకే కావాల్సిన వస్తువులు దొరుకుతాయని అనుకుంటారు. అందుకే ఒక ఫోన్ తీసుకోవాలన్నా.. ల్యాప్ టాప్, టీవీ, మిక్సర్, ఫ్రిడ్జి, వాషింగ్ మిషన్, ఇతర వస్తువులు ఏవైనా తీసుకోవాలని అనుకుంటే చాలామంది ఫ్లిప్ కార్ట్ లేదా అమెజాన్ ఫెస్టివల్ సేల్ టైమ్ తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. నిజంగానే ఫెస్టివల్ సేల్ లో భాగంగా అతి తక్కువ ధరకే ఆయా వస్తువులు లభిస్తున్నాయా? ఆ వస్తువులు అంత తక్కువ ధరకే ఇస్తే.. కంపెనీలకు లాస్ రాదా? మిగితా టైమ్ లో ఎక్కువ ధరకు అమ్మి.. ఫెస్టివల్ సేల్ పేరుతో తక్కువ ధరకు అమ్మితే కంపెనీలకు లాభం ఏంటి.. అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు నిజంగానే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఇంత భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయా? లేక కస్టమర్లకు మోసం చేస్తున్నాయా? కస్టమర్లే వీటి ట్రాప్ లో పడుతున్నారా? బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ పేరుతో తీసుకొచ్చే ఈ సేల్స్ వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటి? తెలుసుకుందాం రండి.
మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే. మీరు ఏదైనా ఒక ప్రాడక్ట్ తీసుకునేటప్పుడు దాని ఎంఆర్పీ ఎంత అని. ఈరోజుల్లో ఏ వస్తువును కూడా ఎంఆర్పీకి అమ్మరు. అంతకంటే తక్కువ ధరకే అమ్ముతారు. ఫెస్టివల్ టైమ్ లోనే కాదు.. మామూలుగా ఈ కామర్స్ సంస్థల్లో ఎంఆర్పీ ధర కంటే తక్కువ ధరకే అమ్ముతారు. కాకపోతే ఫెస్టివల్ టైమ్ లో మాత్రం భారీ డిస్కౌంట్ అని ప్రకటిస్తారు. అలా ఎలా సాధ్యం అవుతుంది. ఫెస్టివల్ టైమ్ లో కాకుండా.. మామూలు టైమ్ లో చూసినా ఈ కామర్స్ సంస్థలు ఎంఆర్పీ ధర కంటే తక్కువ ధరకే ఇస్తాయి. 10 శాతం, 15 శాతం, 20 శాతం ఇలా ప్రాడక్ట్ ను బట్టి డిస్కౌంట్ ను అందిస్తుంటాయి. కొన్ని ఫేక్ ఆఫర్స్ కూడా ఉంటాయి. కొన్ని బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి. కొన్ని ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ ఉంటాయి. ఎలాంటి ఆపర్స్ అయినా సరే.. ఖచ్చితంగా వాళ్ల ట్రాప్ లో పడేలా ఆఫర్లను ఈ కామర్స్ సంస్థలు డిజైన్ చేస్తుంటాయి. నిజానికి.. కొన్ని ప్రాడక్ట్స్ మీద ధర తగ్గించినట్టు కనిపిస్తుంది కానీ.. అసలు ధర తగ్గదు.
అసలు నిజంగా ఈ కామర్స్ సైట్లలో పెట్టే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వర్కవుట్ అవుతుందా? అంటే నో అనే చెప్పుకోవాలి. ఏదైనా ఒక ప్రాడక్ట్ ను బుక్ చేసుకునే ముందు మన దగ్గర ఉన్న వస్తువు వివరాలు అడుగుతారు. ఉదాహరణకు మీ దగ్గర ప్రస్తుతం మీరు వాడుతున్న ఫోన్ ఉంటే.. ఆ ఫోన్ ను ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త ఫోన్ కొనాలని అనుకుంటే.. అప్పుడు ఆ ఫోన్ వివరాలను అడుగుతుంది. ఎప్పుడు తీసుకున్నారు.. మోడల్ ఏంటి.. తీసుకున్నప్పుడు ధర ఎంత.. ఫోన్ కండిషన్ ఏంటి.. అనే వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఒక ఎక్స్‌ఛేంజ్ ధరను చూపిస్తారు. దాని డిస్కౌంట్ పోను.. మిగితా డబ్బులు పే చేసి కొత్త ఫోన్ ను బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక అసలు కథ మొదలవుతుంది. మీ దగ్గర ఉన్న పాత ఫోన్ ను తీసుకెళ్లడానికి డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఆ ఫోన్ ను మొత్తం పరీక్షించి.. ఆ ఫోన్ మీద ఒక చిన్న గీత ఉన్నా కూడా తగ్గిస్తారు. మీకు వెబ్ సైట్ లో రూ.8000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద ఫోన్ కి ఇస్తామని చెబితే.. డెలివరీ బాయ్ వచ్చి అన్నీ చెక్ చేసి.. అదీ ఇదీ కారణం చెప్పి రూ.4000 మాత్రమే వస్తాయి అని చెబుతాడు. దీంతో మీరు చచ్చినట్టు వాళ్లు చెప్పే ఆఫర్ కు ఒప్పుకోవాల్సిందే. మళ్లీ అదనంగా ఆ డబ్బు పే చేస్తేనే మీకు కొత్త ఫోన్ డెలివరీ అవుతుంది. లేదంటే ఆ ఫోన్ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది.
ఇలా.. ఆఫర్స్, డిస్కౌంట్స్ పేరుతో ఈ కామర్స్ సంస్థలు కస్టమర్లను అడ్డంగా మోసం చేస్తుంటాయి. కానీ.. అవి మనల్ని మోసం చేస్తున్నాయని తెలుసుకోకుండా.. తక్కువ ధరకే వస్తువులు వస్తున్నాయి కదా అని ఎగబడి మరీ కొంటున్నాం. వాస్తవాలు తెలుసుకోకుండా.. అసలు ఆ వస్తువు ధర బయట ఎంత ఉందో కూడా తెలుసుకోకుండా కొనేస్తున్నాం. ఒక్కసారి బిగ్ బిలియన్ డేస్ సేల్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పేరుతో ఈ కామర్స్ సంస్థలు కొన్న వేల కోట్ల లాభాలను అర్జిస్తున్నాయి. అంత తక్కువ ధరకే వస్తువులను అమ్మితే మరి వాటికి అన్ని లాభాలు ఎలా వస్తున్నాయి.
ఫేక్ ఆఫర్స్ లో భాగంగా ఎంఆర్పీ ధరలు కూడా పెంచి.. దాని మీద 50 శాతం ఆఫర్ అని చెప్పి కస్టమర్లను బోల్తా కొట్టిస్తారు. ధరల్లో హెచ్చుతగ్గులు కూడా మరో సమస్య. క్రెడిట్ కార్డు ఉంటే 10 శాతం అదనపు డిస్కౌంట్, 20 శాతం అదనపు డిస్కౌంట్ అని ఊదరగొడుతుంటారు. అది కూడా అంతా ఉత్తదే. చాలా క్రెడిట్ కార్డ్స్ లో ఈ ఆఫర్స్ వర్తించవు. ఏదో ఒకటి రెండు క్రెడిట్ కార్డ్స్ కే వర్తిస్తుంది. దీంతో ఈ బ్యాంక్ ఆఫర్స్, క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అనీ ఉత్తవే. అందుకే మీరు ఆన్ లైన్ లో ఏదైనా వస్తువు కొనాలని అనుకుంటే వాళ్లు ఇచ్చే ఆఫర్స్ చూసి అస్సలు మోసపోకండి. నిజంగా ఆ ప్రాడక్ట్ వాల్యు ఎంత ఉంది.. ఇప్పటి వరకు దాన్ని ఎంత తక్కువ ధరకు అమ్మారు. దాన్ని ఎంఆర్పీ ఎంత.. డిస్కౌంట్ ఎంత. ఆఫ్ లైన్ లో ఎంతకు అమ్ముతున్నారు.. అన్నీ కంపేర్ చేసుకొని కొనండి. లేదంటే ఈ కామర్స్ సంస్థలు అడ్డంగా మోసం చేస్తాయి.
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.