Amazon : పండగ సీజన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి షాపింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పండగ సీజన్ లలోనే కదా మనం కొనే వాటిపై డిస్కౌంట్ లాభిస్తాయి. అందుకనే పండగ వచ్చిందంటే జనాలు డిస్కౌంట్ వస్తుందని వివిధ రకాల షాపింగ్ లు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లు నిత్యవసర వస్తువులుగా మారిపోయాయి. ప్రతిదీ ఫోను ద్వారానే చేసుకుంటున్నారు. వేసుకునే బట్టల దగ్గర నుంచి ఇంట్లో వాడే వస్తువుల దాకా ప్రతిదీ ఆన్ లైన్ ద్వారానే షాపింగ్ చేస్తున్నారు. అందువల్లనే ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు భారీ ఆఫర్లను అందిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తూ వస్తున్నాయి.
త్వరలోనే దసరా పండుగ రాబోతుంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 ని తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పండగకు కొత్తగా టీవీ, స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మిషన్లు కొనాలనుకున్న వారికి ఈ ఆఫర్ కలిసొస్తుందని అమెజాన్ చెబుతుంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 సందర్భంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు ఇతర ఉత్పత్తులపై ఏకంగా 40 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
అయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్పటినుంచి ప్రారంభం అవుతుందన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్లపై 40 శాతం గృహాపకరణాలపై ఏకంగా 75% వరకు, అలాగే నిత్యవసరం వస్తువులపై 60 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అయితే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభించనున్న సెప్టెంబర్ 23 నుంచి సేల్ ప్రారంభమవుతుందని తెలుస్తుంది. ఇక ఎస్ బిఐ కార్డుతో అమెజాన్ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎస్ బిఐ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. 10 శాతం వరకు డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంటుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.