Amazon : దసరా షాపింగ్ కు బంపర్ ఆఫర్ రెడీ… భారీ ఆఫర్ అందిస్తున్న అమెజాన్…

Authored By aruna | The Telugu News | Published on: September 8, 2022, 11:00 am

Amazon : పండగ సీజన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి షాపింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పండగ సీజన్ లలోనే కదా మనం కొనే వాటిపై డిస్కౌంట్ లాభిస్తాయి. అందుకనే పండగ వచ్చిందంటే జనాలు డిస్కౌంట్ వస్తుందని వివిధ రకాల షాపింగ్ లు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లు నిత్యవసర వస్తువులుగా మారిపోయాయి. ప్రతిదీ ఫోను ద్వారానే చేసుకుంటున్నారు. వేసుకునే బట్టల దగ్గర నుంచి ఇంట్లో వాడే వస్తువుల దాకా ప్రతిదీ ఆన్ లైన్ ద్వారానే షాపింగ్ చేస్తున్నారు. అందువల్లనే ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు భారీ ఆఫర్లను అందిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తూ వస్తున్నాయి.

త్వరలోనే దసరా పండుగ రాబోతుంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 ని తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పండగకు కొత్తగా టీవీ, స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మిషన్లు కొనాలనుకున్న వారికి ఈ ఆఫర్ కలిసొస్తుందని అమెజాన్ చెబుతుంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 సందర్భంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు ఇతర ఉత్పత్తులపై ఏకంగా 40 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

Amazon offers smartphones and tvs

Amazon offers smartphones and tvs

అయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్పటినుంచి ప్రారంభం అవుతుందన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్లపై 40 శాతం గృహాపకరణాలపై ఏకంగా 75% వరకు, అలాగే నిత్యవసరం వస్తువులపై 60 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అయితే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభించనున్న సెప్టెంబర్ 23 నుంచి సేల్ ప్రారంభమవుతుందని తెలుస్తుంది. ఇక ఎస్ బిఐ కార్డుతో అమెజాన్ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎస్ బిఐ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. 10 శాతం వరకు డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంటుంది.

aruna

No bio available for this author.

  1. "Ali Wife Zubeda Begum : అలీ భార్య జుబేదా బేగం నెల సంపాదన ఎంతో తెలుసా?.. ఆస్తుల విలువపై హాట్ టాపిక్‌..!"

  2. "Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్‌లో ఊహించని ట్విస్ట్.. నామినేషన్లలో టాప్ కంటెస్టెంట్లు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరు?"

  3. "Rahul Gandhi Indira Gandhi : నానమ్మ ఇందిరా గాంధీతో చిన్నారి రాహుల్ గాంధీ ముచ్చట్లు.. 45 ఏళ్ల నాటి అరుదైన పోస్ట్‌ వైరల్!"

  4. "Chandrababu : కూటమి, వైసీపీ మధ్య భారీ గ్యాప్.. చంద్రబాబు చెప్పిన లెక్కలివే!"

  5. "Varanasi Movie Story Leak : వారణాసి కథ లీక్.. మహేష్ బాబు గ్లోబల్ వేట వెనుక అసలు రహస్యం ఇదేనా..?"

  6. "Chicken Egg Prices Hike : నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న చికెన్, గుడ్ల ధరలు!"

  7. "Airtel Recharge Offer : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే మరో నెల ఫ్రీ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp