Passport : పాస్‌పోర్ట్ అప్లై చేస్తున్నారా..? అయితే ఈ కొత్త రూల్స్ ను గమనించండి..!
ప్రధానాంశాలు:
Passport : పాస్‌పోర్ట్ అప్లై చేస్తున్నారా..? అయితే ఈ కొత్త రూల్స్ ను గమనించండి..!
Passport : పాస్‌పోర్ట్ అనేది అంతర్జాతీయ ప్రయాణాల్లో గుర్తింపు పత్రంగా వాడే డాక్యుమెంట్. భారత ప్రభుత్వం ఈ ప్రక్రియను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చేందుకు కొత్త మార్గదర్శకాలను అమలు చేసింది. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌కు సంబంధించి మార్పులు అమలులోకి వచ్చాయి. 2023 అక్టోబర్ 1 తర్వాత జన్మించిన వారు పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునేటప్పుడు బర్త్ సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా సమర్పించాలి. ఈ సర్టిఫికేట్‌ను మునిసిపల్ కార్పొరేషన్ లేదా అధికారిక జనన మరణాల రిజిస్ట్రార్ నుండి పొందాల్సి ఉంటుంది. ఇది వయసు ధృవీకరణలో ఖచ్చితత్వాన్ని అందించేందుకు తీసుకున్న చర్య.

Passport : పాస్‌పోర్ట్ అప్లై చేస్తున్నారా..? అయితే ఈ కొత్త రూల్స్ ను గమనించండి..!
Passport : పాస్‌పోర్ట్ అప్లై చేసుకునేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
ఈ మార్పులు ప్రైవసీ పరిరక్షణకు దోహదపడే విధంగా రూపొందించబడ్డాయి. పాస్‌పోర్ట్ చివరి పేజీలో ఇకపై తల్లిదండ్రుల పేర్లు ముద్రించరు. ఇది సింగిల్-పేరెంట్ కుటుంబాలు లేదా విడాకులైన తల్లిదండ్రుల పిల్లలకు ప్రైవసీని కల్పిస్తుంది. అలాగే అడ్రస్‌ను బార్‌కోడ్ రూపంలో మాత్రమే ప్రింట్ చేయనున్నారు. ఇది స్కాన్ చేయగలిగే విధంగా ఉండి, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా నిరోధిస్తుంది. పాస్‌పోర్ట్‌లను కలర్-కోడింగ్ విధానంలో జారీ చేస్తారు – సాధారణ పౌరులకు నీలం, అధికారులకు తెలుపు, డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌లకు ఎరుపు రంగు ఇవ్వబడుతుంది.
పాస్‌పోర్ట్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల (POPSKs) సంఖ్యను 442 నుంచి 600కి పెంచే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పటివరకు చాలా మంది బర్త్ సర్టిఫికేట్‌లు తీసుకోకపోవడం, రికార్డులు లేకపోవడం వంటివి పెద్ద సమస్యలుగా ఉండేవి. కానీ 1969 జనన మరణాల నమోదు చట్టాన్ని కఠినంగా అమలు చేయడం ద్వారా డాక్యుమెంట్ల సరైన వేరిఫికేషన్‌కు మార్గం సుగమమైంది. భవిష్యత్తులో అన్ని పాస్‌పోర్ట్ దరఖాస్తుల ప్రాసెస్ మరింత సమర్థవంతంగా, గౌరవప్రదంగా ఉండేలా ఈ మార్పులు చేపట్టబడ్డాయి.