Electric Tractor : రైతులకు శుభవార్త... ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వచ్చేస్తున్నాయి..!
Electric Tractor : రైతులకు శుభవార్త… వ్యవసాయంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్‌ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి చేశాడు. లేటెస్ట్ డ్రైవర్‌లెస్ టెక్నాలజీకి ఏఐ (Artificial intelligence) జోడించి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ రూపొందించాడు. ఈ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే దుక్కి దున్నేస్తుంది. అలాగే ఇతర వ్యవసాయ పనులను సైతం సునాయాసంగా చేస్తుంది.
పుణెకు చెందిన సిద్ధార్థ్ గుప్తా(25) అనే ఇంజినీరింగ్ యువకుడు ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. 2019లో సిద్ధార్థ్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లపై రీసెర్చ్ చేయడం ప్రారంభించాడు. 2023లో తన పరిశోధనను పూర్తి చేసి వీఆర్డీ మోటార్స్ అనే కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీలో ఏఐ బేస్డ్ డ్రైవర్‌లెస్ ట్రాక్టర్లను గుజరాత్, మధ్యప్రదేశ్‌లో తయారు చేయడం ప్రారంభించాడు. ఈ ట్రాక్టర్లను సోలార్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. దీంతో రైతుకు డ్రైవర్, డీజిల్ ఖర్చు ఆదా అవుతుంది.
Electric Tractor : రైతులకు శుభవార్త… ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వచ్చేస్తున్నాయి..!
ఇందులో 15 హెచ్‌పీ, 50 హెచ్‌పీ సామర్థ్యం గల రెండు రకాల ట్రాక్టర్లు సిద్ధార్థ్ కంపెనీలో తయారవుతున్నాయి. ఈ ట్రాక్టర్ తయారీలో వాడిన బ్యాటరీ సహా పరికరాలన్నీ దేశీయంగా అభివృద్ధి చేసినవే కావడం గమనార్హం. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను సోలార్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మరొక అదనపు బ్యాటరీ ఇందులో ఉంటుంది. దీనికి ఛార్జ్ చేసి అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు. ఈ ట్రాక్టర్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 10 నుంచి 15 గంటల వరకు నిర్విరామంగా పని చేస్తుంది. ఈ ట్రాక్టర్లకు సిద్ధార్థ్ పేటెంట్ సైతం పొందాడు. అతి త్వరలో మార్కెట్లోకి రానున్నాయి.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.