Electric Tractor : రైతులకు శుభవార్త… ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వ‌చ్చేస్తున్నాయి..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 September 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Electric Tractor : రైతులకు శుభవార్త... ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వ‌చ్చేస్తున్నాయి..!

Electric Tractor : రైతులకు శుభవార్త… వ్యవసాయంలో రైతులకు వెన్నుద‌న్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్‌ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి చేశాడు. లేటెస్ట్‌ డ్రైవర్‌లెస్ టెక్నాలజీకి ఏఐ (Artificial intelligence) జోడించి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ రూపొందించాడు. ఈ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే దుక్కి దున్నేస్తుంది. అలాగే ఇత‌ర వ్యవసాయ పనులను సైతం సునాయాసంగా చేస్తుంది.

పుణెకు చెందిన సిద్ధార్థ్ గుప్తా(25) అనే ఇంజినీరింగ్ యువకుడు ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. 2019లో సిద్ధార్థ్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లపై రీసెర్చ్ చేయడం ప్రారంభించాడు. 2023లో తన పరిశోధనను పూర్తి చేసి వీఆర్డీ మోటార్స్ అనే కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీలో ఏఐ బేస్డ్ డ్రైవర్‌లెస్‌ ట్రాక్టర్లను గుజరాత్, మధ్యప్రదేశ్‌లో తయారు చేయడం ప్రారంభించాడు. ఈ ట్రాక్టర్లను సోలార్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. దీంతో రైతుకు డ్రైవర్, డీజిల్ ఖర్చు ఆదా అవుతుంది.

Electric Tractor : రైతులకు శుభవార్త... ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వ‌చ్చేస్తున్నాయి..!

Electric Tractor : రైతులకు శుభవార్త… ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వ‌చ్చేస్తున్నాయి..!

ఇందులో 15 హెచ్‌పీ, 50 హెచ్‌పీ సామర్థ్యం గల రెండు రకాల ట్రాక్టర్లు సిద్ధార్థ్ కంపెనీలో తయారవుతున్నాయి. ఈ ట్రాక్టర్ తయారీలో వాడిన బ్యాటరీ సహా పరికరాలన్నీ దేశీయంగా అభివృద్ధి చేసినవే కావడం గ‌మ‌నార్హం. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను సోలార్‌ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మరొక అదనపు బ్యాటరీ ఇందులో ఉంటుంది. దీనికి ఛార్జ్ చేసి అవసరం వ‌చ్చిన‌ప్పుడు వాడుకోవచ్చు. ఈ ట్రాక్టర్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 10 నుంచి 15 గంటల వరకు నిర్విరామంగా ప‌ని చేస్తుంది. ఈ ట్రాక్టర్లకు సిద్ధార్థ్‌ పేటెంట్ సైతం పొందాడు. అతి త్వరలో మార్కెట్లోకి రానున్నాయి.

Also read

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి