Bajaj Chetak : బ‌జాజ్ చేత‌క్ ప్రేమికులకి గుడ్ న్యూస్.. మార్కెట్‌లోకి వ‌చ్చిన కొత్త స్కూట‌ర్ ఫీచ‌ర్స్ అదుర్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bajaj Chetak : బ‌జాజ్ చేత‌క్ ప్రేమికులకి గుడ్ న్యూస్.. మార్కెట్‌లోకి వ‌చ్చిన కొత్త స్కూట‌ర్ ఫీచ‌ర్స్ అదుర్స్

 Authored By ramu | The Telugu News | Updated on :21 December 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Bajaj Chetak : బ‌జాజ్ చేత‌క్ ప్రేమికులకి గుడ్ న్యూస్.. మార్కెట్‌లోకి వ‌చ్చిన కొత్త స్కూట‌ర్ ఫీచ‌ర్స్ అదుర్స్

Bajaj Chetak : ఒక‌ప్పుడు బ‌జాజ్ చేత‌క్‌కి Bajaj Chetak Scooter  ఎంత గిరాకి ఉండేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు తిరిగి బ‌జాజ్ చేత‌క్‌ని  స‌రికొత్త మార్పుల‌తో మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. డీజిల్‌ ధరలు పెరిగిన తర్వాత వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు అడుగులు వేశాయి. దీంతో చాలా కంపెనీల నుంచి ఈవీ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా మరిన్ని టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో బజాజ్‌ చేతక్‌ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది.అదిరే ఫీచర్లతో దీన్ని మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. ‘చేతక్‌ 35’ సిరీస్‌లో ‘3501’, ‘3502’ పేర్లతో రెండు వెర్షన్లను తీసుకొచ్చింది.

Bajaj Chetak బ‌జాజ్ చేత‌క్ ప్రేమికులకి గుడ్ న్యూస్ మార్కెట్‌లోకి వ‌చ్చిన కొత్త స్కూట‌ర్ ఫీచ‌ర్స్ అదుర్స్

Bajaj Chetak : బ‌జాజ్ చేత‌క్ ప్రేమికులకి గుడ్ న్యూస్.. మార్కెట్‌లోకి వ‌చ్చిన కొత్త స్కూట‌ర్ ఫీచ‌ర్స్ అదుర్స్

Bajaj Chetak స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో..

వీటిలో ‘3501’ అనేది టాప్-స్పెక్ వెర్షన్. కంపెనీ కాగా, ఈ ప్రీమియం మోడల్​ను రూ. 1.27 లక్షల ఎక్స్​-షోరూమ్​ ధరతో తీసుకొచ్చింది. ‘3502’ అనేది మిడ్ రేంజ్ వేరియంట్. ఇక దీని ధరను రూ.1.20 లక్షల ఎక్స్​-షోరూమ్​గా నిర్ణయించింది. అయితే ఈ సిరీస్‌లో ‘3503’ బేస్ వేరియంట్​ను త్వరలో తీసుకురానున్నారు. పాత చేతక్‌ ఎలక్ట్రిక్‌ మాదిరిగానే అదే క్లాసిక్‌ లుక్‌తో కొత్త మోడల్‌ను తీసుకువచ్చింది బజాజ్‌. ఇందులో 3.5 kWh బ్యాటరీ, 4kW మోటార్‌ను అమర్చింది కంపెనీ. ఈ స్కూటర్ 73 కిలోమీటర్ల టాప్‌స్పీడ్‌తో దూసుకెళ్తుంది. సింగిల్‌ ఛార్జ్‌తో 153 కిలోమీటర్లు వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. బ్యాటరీని 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్‌ చేయొచ్చని తెలిపింది.

ఈ స్కూటర్ 950W ఛార్జర్‌తో వస్తుంది. దీనితో ఈ స్కూటర్​ను మూడు గంటల్లో 0-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. కొత్త బజాజ్ చేతక్ దాని ప్రీవియస్ మోడల్​ల్ మాదిరిగానే ఎక్విప్మెంట్స్​తో వస్తుంది. దీని టాప్ టూ మోడల్స్ టాప్ స్పీడ్​ 73kph. దీని బేస్ 3503 మోడల్ గరిష్ట వేగం 63kph. అయితే ఈ మోడల్​ను కంపెనీ ఇంకా తీసుకుని రాలేదు. కంపెనీ త్వరలోనే దీన్ని రిలీజ్ చేయనుంది. ఇది 35-లీటర్ బూట్ స్పేస్​తో వస్తుంది. వీల్​బేస్​ కూడా 25 mm నుంచి 1,350 mm వరకు పెరిగింది. వీటితోపాటు దీని సీటు ఇప్పుడు 80 mm పొడవుతో వస్తుంది. వీటిలో ఇంటిగ్రేటెడ్ మ్యాప్స్​తో టీఎఫ్‌టీ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, స్క్రీన్ మిర్రరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ఇందులో డాక్యుమెంట్ స్టోరేజ్, జియో-ఫెన్సింగ్, థెఫ్ట్ వార్నింగ్, ఓవర్ స్పీడ్​ అలెర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం 3201, 3202, 2903, 3201 స్పెషల్‌ ఎడిషన్‌ పేరిట నాలుగు వెర్షన్లను అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 3 లక్షల చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది