Big Billion Days Sale : వీడికి లక్కు మామూలుగా లేదుగా… ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే ఐఫోన్ 14 వచ్చింది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Big Billion Days Sale : వీడికి లక్కు మామూలుగా లేదుగా… ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే ఐఫోన్ 14 వచ్చింది…!

Big Billion Days Sale : ప్రతి ఒక్కరికి అదృష్టం అనేది దాదాపుగా ఉంటుంది. కొంతమందికి వాళ్ళు ఏం చేసినా కలిసేస్తుంది. మరి కొంతమందికి అప్పుడప్పుడు కొన్ని విషయాలలో మాత్రమే లక్ ఉంటుంది. అయితే ఇంకొంతమందికి మాత్రం అస్సలు లక్ ఉండదు. మేటర్ లోకి వెళితే ఫ్లిప్ కార్ట్ ఇటీవల బిగ్ బిలియన్ డేస్ సేల్ ను నిర్వహించింది. ప్రస్తుతం ఈ సేల్ అందుబాటులో లేదు. ఈ సేల్ లో భాగంగా ఎన్నో రకాల ఆఫర్లను వినియోగదారులకు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :6 October 2022,11:34 am

Big Billion Days Sale : ప్రతి ఒక్కరికి అదృష్టం అనేది దాదాపుగా ఉంటుంది. కొంతమందికి వాళ్ళు ఏం చేసినా కలిసేస్తుంది. మరి కొంతమందికి అప్పుడప్పుడు కొన్ని విషయాలలో మాత్రమే లక్ ఉంటుంది. అయితే ఇంకొంతమందికి మాత్రం అస్సలు లక్ ఉండదు. మేటర్ లోకి వెళితే ఫ్లిప్ కార్ట్ ఇటీవల బిగ్ బిలియన్ డేస్ సేల్ ను నిర్వహించింది. ప్రస్తుతం ఈ సేల్ అందుబాటులో లేదు. ఈ సేల్ లో భాగంగా ఎన్నో రకాల ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. వినియోగదారులకు భారీ తగ్గింపు ఆఫర్లను వినియోగించుకున్నారు. అలాగే ఐఫోన్లపై కూడా భారీ ఆఫర్లు ఉండడంతో బిగ్ బిలియన్ డేస్ సేల్ లో చాలామంది ఐఫోన్లు కొనుగోలు చేసి ఉంటారు.

ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ ఆర్డర్లు క్యాన్సిల్ చేసిందని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇక్కడ మాత్రం ఓ వ్యక్తికి ఫ్లిప్ కార్ట్ తీపి కబురు అందించింది. ఐఫోన్ 13 ఆర్డర్ ఇస్తే ఐఫోన్ 14 డెలివరీ చేశారు. ఇటీవల జరిగిన బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఫోన్ 13 ధర 50వేల వరకు ఉంది. ఈ విషయాన్ని ట్విట్టర్ యూజర్ వెల్లడించారు. ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే ఐఫోన్ 14 వచ్చిందని తెలిపారు. రిటైల్ బాక్స్ వంటి వాటిని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆర్డర్ వివరాల ప్రకారం ఐఫోన్ కోసం రూ.49,019 చెల్లించి ట్రాన్సాక్షన్ పూర్తి చేశాడు అయితే ఇతనికి ఐఫోన్ 14 డెలివరీ అయింది. ఐఫోన్ 14 ధర 80000 వద్ద ఉంది.

Big Billion Days Sale iPhone 13 Ordered and got iPhone 14

Big Billion Days Sale iPhone 13 Ordered and got iPhone 14

ఐఫోన్ 13 కి అప్ గ్రేడ్ గా ఐఫోన్ 14న మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఐఫోన్ 13 లో 128 జిబి మెమొరీ, 6.1 అంగుళాల డిస్ప్లే 12 ఎంపీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఏ15 బయోనిక్ చిప్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక ఐఫోన్ 14లో 128 జీబీ ర్యామ్, 6.1 అంగుళాల స్క్రీన్, 12 ఎంపీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఏ15 బయోనిక్ చిప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దాదాపుగా రెండింటిలోనూ ఒకే ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్ 14 ధర రూ.79,900 నుంచి ప్రారంభం అవుతుంది. ఐఫోన్ 13 ధర రూ.59,900 మంచి ప్రారంభం అవుతుంది. అయితే రెండింటికి చాలా తేడా ఉంది. ఐఫోన్ 13 కాకుండా ఐఫోన్ 14 కొన్నవారికి మంచి బెనిఫిట్ లభించి ఉంటుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది