Credit Card : క్రెడిట్ కార్డ్ వినియోగ‌దారుల‌కి గుడ్ న్యూస్.. పేమెంట్ లేట్ అయిన ప‌ర్లేదు అన్న ఆర్బీఐ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Credit Card : క్రెడిట్ కార్డ్ వినియోగ‌దారుల‌కి గుడ్ న్యూస్.. పేమెంట్ లేట్ అయిన ప‌ర్లేదు అన్న ఆర్బీఐ

Credit Card : ఈ రోజుల్లో ఎవ‌రి ద‌గ్గ‌ర చూసిన కూడా క్రెడిట్ కార్డులు క‌నిపిస్తున్నాయి.ఈ కార్డుల వినియోగం గణనీయంగా పెరిగింది. వీటిని అవసరానికి వినియోగించుకుని ప్రతి నెలా తమ బిల్లులు చెల్లిస్తుంటారు వినియోగదారులు. అందులో కొందరు తమ బిల్లులు చెల్లిస్తుంటే కొందరు మినిమమ్ బిల్లు మాత్రమే చెల్లించి కాలయాప‌న చేస్తుంటారు. ఆ సమ‌యంలో వినియోగ‌దారుడు చెల్లించాల్సిన దాని క‌న్నా ఎక్కువ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక కొందరు కస్టమర్లు భవిష్యత్తు అవసరాల దృష్టా ఔట్ స్టాండింగ్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 May 2024,9:10 pm

ప్రధానాంశాలు:

  •  Credit Card : క్రెడిట్ కార్డ్ వినియోగ‌దారుల‌కి గుడ్ న్యూస్.. పేమెంట్ లేట్ అయిన ప‌ర్లేదు అన్న ఆర్బీఐ

Credit Card : ఈ రోజుల్లో ఎవ‌రి ద‌గ్గ‌ర చూసిన కూడా క్రెడిట్ కార్డులు క‌నిపిస్తున్నాయి.ఈ కార్డుల వినియోగం గణనీయంగా పెరిగింది. వీటిని అవసరానికి వినియోగించుకుని ప్రతి నెలా తమ బిల్లులు చెల్లిస్తుంటారు వినియోగదారులు. అందులో కొందరు తమ బిల్లులు చెల్లిస్తుంటే కొందరు మినిమమ్ బిల్లు మాత్రమే చెల్లించి కాలయాప‌న చేస్తుంటారు. ఆ సమ‌యంలో వినియోగ‌దారుడు చెల్లించాల్సిన దాని క‌న్నా ఎక్కువ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక కొందరు కస్టమర్లు భవిష్యత్తు అవసరాల దృష్టా ఔట్ స్టాండింగ్ అమౌంట్ కంటే ఎక్కువే చెల్లించి దానిని త‌ర్వాత ఉప‌యోగించుకోవ‌డం కూడా మ‌నం చూస్తున్నాం. అయితే క్రెడిట్ కార్డులు వాడే వినియోగ‌దారుల‌కి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది.

Credit Card : క్రెడిట్ కార్డులు వాడే వారు టెన్ష‌న్ ప‌డొద్దు..

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు ఆలస్యమైనా పర్లేదని.. విన‌యోగ‌దారుల‌కి కాస్త టైం ఇవ్వాలని బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ . క్రెడిట్ కార్డుల్ని ఎంచుకునే అధికారం వినియోగదారులకు ఉంటుందని కూడా ఆర్బీఐ చెప్పుకొచ్చింది.వినియోగ‌దారుడు మాస్టర్ కార్డ్, వీసా వంటి క్రెడిట్ కార్డ్స్ ని ఎంచుకునేలా చూడాల‌ని తెలియ‌జేసింది. అయితే ఆర్బీఐ ప్ర‌వేశ‌పెట్టిన నిబంధ‌న‌లు 2024 సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి రానుంది. ఇక పేమెంట్స్ విష‌యానికి వ‌స్తే.. మ‌నం సాధార‌ణంగా ఒక తేదికి బిల్లు క‌ట్టాల్సి వ‌స్తుంది. కాని కొన్ని ప‌రిస్థితుల వ‌ల‌న మ‌రిచిపోతుంటాం. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే బిల్ డేట్ గుర్తు పెట్టుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌వుతుంది.

Credit Card క్రెడిట్ కార్డ్ వినియోగ‌దారుల‌కి గుడ్ న్యూస్ పేమెంట్ లేట్ అయిన ప‌ర్లేదు అన్న ఆర్బీఐ

Credit Card : క్రెడిట్ కార్డ్ వినియోగ‌దారుల‌కి గుడ్ న్యూస్.. పేమెంట్ లేట్ అయిన ప‌ర్లేదు అన్న ఆర్బీఐ

ఒక్కో క్రెడిట్ కార్డుకి ఒక్కో డ్యూ డేట్ ఉంటుంది. దీంతో డేట్స్ గుర్తులేక చాలా మంది డ్యూ డేట్ లోగా క్రెడిట్ కార్డు బిల్స్ చెల్లించక‌పోవ‌డం మ‌నం చూస్తున్నాం. అయితే స‌మ‌యానికి బిల్ క‌ట్ట‌లేక‌పోతున్నందుకు ఫీజు పడుతుంది. దీంతో క్రెడిట్ కార్డు యూజర్లు ఆందోళన చెందుతుంటారు. ఆయితే ఇకపై అలాంటి టెన్ష‌న్ లేకుండా కస్టమర్లకు ఊరటనిచ్చేలా ఆర్బీఐ.. గ్రేస్ పీరియడ్ రూల్ ని తీసుకొచ్చింది. మూడు రోజుల వరకూ కస్టమర్లకు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయ‌కూడద‌ని ఆదేశాలు జారీ చేసింది. లేట్ పేమెంట్ ఫీజు వంటివి.. మొత్తం క్రెడిట్ కార్డు అమౌంట్ మీద కాకుండా.. అవుట్ స్టాండింగ్ అమౌంట్ పైనే విధించాలని ఆర్బీఐ వెల్లడించింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది