Credit Card : ఫస్ట్ టైమ్ క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలియకపోతే నష్టపోవడం ఖాయం
ప్రధానాంశాలు:
Credit Card : ఫస్ట్ టైమ్ క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలియకపోతే నష్టపోవడం ఖాయం
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో ఉపయోగిస్తే మీ క్రెడిట్ స్కోరు పెరగడమే కాకుండా, రివార్డులు, క్యాష్‌బ్యాక్ ద్వారా లాభం పొందవచ్చు. కానీ, అవగాహన లేకపోతే అది భారీ వడ్డీల భారానికి దారితీస్తుంది. అందుకే, మీ ఫస్ట్ క్రెడిట్ కార్డును ఎంచుకునే ముందు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. లేదంటే క్రెడిక్ కార్డు పేరుతో భారీగా నష్టపోతారు.
Credit Card : ఫస్ట్ టైమ్ క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలియకపోతే నష్టపోవడం ఖాయం
Credit Card మీ ఖర్చులను బట్టే కార్డు ఉండాలి
భారీ ఆఫర్ల కంటే మీ అవసరాలకు తగ్గట్టుగా కార్డును ఎంచుకోండి. మీరు నిత్యావసరాలు ఎక్కువగా కొంటారా? లేక ఆన్‌లైన్ షాపింగ్, ఫ్యూయల్ (పెట్రోల్, డీజిల్) పై ఎక్కువ ఖర్చు చేస్తారా? అనేది గమనించి, ఆ కేటగిరీలో ఎక్కువ రివార్డులు ఇచ్చే కార్డును ఎంచుకోండి.
రివార్డ్ పాయింట్ల అసలు విలువ తెలుసుకోండి
ఎక్కువ పాయింట్లు ఇస్తున్నారంటే అది మంచి కార్డు అని అర్థం కాదు. ఒక్కో పాయింట్ విలువ ఎంత? వాటిని ఎలా నగదుగా లేదా వోచర్లుగా మార్చుకోవచ్చు? అనేది ముందే తెలుసుకోవాలి.
కేటగిరీ బోనస్‌లు
కొన్ని కార్డులు బిల్లు చెల్లింపులు లేదా ఫుడ్ డెలివరీ యాప్స్‌పై 10 నుంచి 15 శాతం వరకు అధిక రివార్డులను అందిస్తాయి. మీ ఖర్చులు ఈ కేటగిరీల్లో ఉంటే మీకు లాభం ఎక్కువగా ఉంటుంది.
యాన్యువల్ ఫీజు, మినహాయింపు
కార్డు వార్షిక రుసుము ఎంత ఉందో చూడండి. ఒక నిర్ణీత మొత్తం ఖర్చు చేస్తే ఆ ఫీజును రద్దు చేసే వెసులుబాటు ఉందో లేదో చెక్ చేయండి. కేవలం ఫీజును రద్దు చేసుకోవడం కోసం మీ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయకండి.
మైల్‌స్టోన్ బెనిఫిట్స్
ఏడాదిలో లక్ష లేదా రెండు లక్షల రూపాయలు ఖర్చు చేస్తే వచ్చే బోనస్ పాయింట్లపై ఆశపడి, అనవసరంగా ఖర్చు చేయకండి. అది మీ సహజమైన ఖర్చులకు అనుగుణంగా ఉంటేనే పరిగణనలోకి తీసుకోండి.
అదనపు ప్రయోజనాలపై అతిగా ఆశపడొద్దు
ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, సినిమా టికెట్ డిస్కౌంట్లు ఆకర్షణీయంగా అనిపిస్తాయి. కానీ, మీరు వాటిని అసలు ఉపయోగిస్తారా లేదా అనేది ఆలోచించండి. ముఖ్యమైన రివార్డులకే ప్రాధాన్యత ఇవ్వండి.
కస్టమర్ సర్వీస్ ముఖ్యం
ఏదైనా మోసం జరిగినప్పుడు లేదా కార్డు పోగొట్టుకున్నప్పుడు బ్యాంక్ స్పందన ఎలా ఉంటుంది అనేది ముఖ్యం. మంచి కస్టమర్ సపోర్ట్ ఉన్న బ్యాంక్ కార్డును ఎంచుకోవడం ఉత్తమం.
సులభంగా అప్రూవల్ వచ్చే చోట దరఖాస్తు చేయండి
మొదటిసారి కార్డు అప్లై చేసేటప్పుడు మీ శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంక్‌లో ప్రయత్నిస్తే అప్రూవల్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఒకేసారి నాలుగైదు బ్యాంకుల్లో దరఖాస్తు చేస్తే మీ క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది.
వడ్డీ రేట్ల విషయంలో జాగ్రత్త
క్రెడిట్ కార్డుపై వడ్డీ రేట్లు ఏడాదికి 36 నుంచి 42 శాతం వరకు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ మీ బిల్లును గడువులోగా పూర్తిగా చెల్లించండి. కార్డును ఒక పేమెంట్ టూల్‌గా చూడండి కానీ, అప్పు ఇచ్చే యంత్రంలా కాదు.