Mahindra XUV 7XO : కస్టమర్లు ఎదురుచూస్తున్నా మహీంద్రా XUV 7XO .. సూపర్ లుక్‌లో XUV..!
ప్రధానాంశాలు:
Mahindra XUV 7 XO : కస్టమర్లు ఎదురుచూస్తున్నా మహీంద్రా XUV 7XO .. సూపర్ లుక్‌లో XUV..!
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు కొత్త రూపంలో మరింత ఆకర్షణీయంగా మార్కెట్‌లోకి వచ్చింది. కంపెనీ తాజాగా విడుదల చేసిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్, మహీంద్రా XUV 7XO పేరుతో అందుబాటులోకి వచ్చింది. స్టైలింగ్ ఇంటీరియర్ మరియు ఫీచర్లలో చేసిన మార్పులు వినియోగదారుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Mahindra XUV 7 XO : కస్టమర్లు ఎదురుచూస్తున్నా మహీంద్రా XUV 7XO .. సూపర్ లుక్‌లో XUV..!
Mahindra XUV 7 XO : టెస్ట్ డ్రైవ్‌లు మరియు బుకింగ్స్ ప్రారంభం
మహీంద్రా XUV 7XO టెస్ట్ డ్రైవ్‌లు జనవరి 8 నుంచి ప్రారంభమయ్యాయి. కొత్త డిజైన్ ఇంటీరియర్ లుక్ మరియు డ్రైవింగ్ అనుభవాన్ని ప్రత్యక్షంగా చూడటానికి కస్టమర్లు పెద్ద సంఖ్యలో షోరూమ్‌లకు చేరుతున్నారు. ఇప్పటికే బుకింగ్‌లు చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు జనవరి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. షోరూమ్‌లలో వాహనాన్ని ప్రత్యక్షంగా చూసిన వినియోగదారులు కొత్త SUVపై ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద కుటుంబాలకు అనువైన స్పేస్ ప్రీమియం ఫీల్ ఇస్తున్న ఇంటీరియర్ ఆధునిక ఫీచర్లు ఈ SUV ఆకర్షణను మరింత పెంచుతున్నాయి. కస్టమర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి షోరూమ్‌లను సందర్శిస్తూ వాహనాన్ని దగ్గరగా పరిశీలిస్తున్నారు.
Mahindra XUV 7 XO : శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్స్
XUV 7XO కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్: 2.0-లీటర్ M-స్టాలియన్ టర్బోచార్జ్డ్ ఇంజన్, 200 bhp పవర్ మరియు 380 Nm టార్క్. వేగవంతమైన, స్మూత్ డ్రైవింగ్ అనుభవానికి సరైన ఎంపిక. డీజిల్ వేరియంట్: 2.2-లీటర్ M-హాక్ ఇంజన్ 182 bhp పవర్, 420 Nm టార్క్. ఆటోమేటిక్ వేరియంట్‌లో టార్క్ 450 Nm వరకు పెరుగుతుంది. దీని వల్ల హైవే డ్రైవింగ్ మరియు భారీ లోడుతో ప్రయాణాలు సులభం అవుతాయి. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ కూడా అందిస్తోంది. ఇది మల్టీ-టెర్రైన్ డ్రైవింగ్ కోసం మరింత స్థిరత్వం ఇస్తుంది.
Mahindra XUV 7 XO : ప్రీమియం ఇంటీరియర్ & భద్రతా ఫీచర్లు
XUV 7XOలో డ్యాష్‌బోర్డ్‌పై మూడు 12.3 అంగుళాల స్క్రీన్‌లు ఉన్నాయి..ఇవి SUVకు ఫ్యూచరిస్టిక్ ఫీల్ ఇస్తాయి..
. డ్రైవర్ కోసం డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
. సెంటర్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్
. ముందు ప్రయాణికుడి కోసం ప్రత్యేక స్క్రీన్
భద్రత విషయానికి వస్తే, SUVలో లెవల్ 2 ప్లస్ ADAS, రాడార్, కెమెరా సిస్టమ్‌లు ఉన్నాయి. కొత్త 540 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, మరియు 120కు పైగా భద్రతా ఫీచర్లతో XUV 7XO వినియోగదారుల కోసం అత్యంత భద్రతా ప్రాధాన్యత కలిగిన SUVగా మారింది. మహీంద్రా XUV 7XO నూతన డిజైన్, శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్స్ ఆధునిక ఇంటీరియర్ మరియు అత్యాధునిక భద్రతా ఫీచర్ల కలయికతో SUV మార్కెట్లో కొత్త రేంజ్ సెట్ చేస్తుంది. ఇది కుటుంబSUVలకు ప్రీమియం అనుభవం కోరుకునే డ్రైవర్లకు మరియు అధునాతన టెక్నాలజీ ప్రేమికులకు అనువైన వాహనం.