Home Loans : ఒక్క పర్సన్ ఎన్ని హోమ్ లోన్స్ తీసుకోవచ్చో తెలుసా..?
ప్రధానాంశాలు:
Home Loans : ఒక్క పర్సన్ ఎన్ని హోమ్ లోన్స్ తీసుకోవచ్చో తెలుసా..?
Home Loans : ప్రతి ఒక్కరూ జీవితంలో సొంతిల్లు కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో సేవింగ్స్ ప్రారంభిస్తారు. కొందరు పూర్తిగా తమ ఆదాయంతో ఇంటి కొనుగోలు చేయగలిగితే, మరికొందరు హోమ్ లోన్ తీసుకుని ఆ కలను సాకారం చేసుకుంటారు. అయితే హోమ్ లోన్ తీసుకునే విషయంలో చాలామందికి ఒక సందేహం కలుగుతుంది. ఒకే వ్యక్తి రెండు హోమ్ లోన్లు తీసుకోవచ్చా అనే ప్రశ్న. ఇందులో ప్రధానంగా రుణదాతలు ఆ వ్యక్తి రిపేమెంట్ సామర్థ్యాన్ని, లోన్ అవసరాన్ని, అప్పటికే ఉన్న లోన్ల వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు.

Home Loans : ఒక్క పర్సన్ ఎన్ని హోమ్ లోన్స్ తీసుకోవచ్చో తెలుసా..?
Home Loans : హోమ్ లోన్స్ అనేవి ఎన్నిసార్లయినా ఇస్తారా..? దానికి ఉండే రూల్స్ ఏంటి..?
ఇన్‌కం మరియు రుణ పరిమితి ఆధారంగా రుణదాతలు నిర్ణయం తీసుకుంటారు. బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థలు రుణ మంజూరుపై నిర్ణయం తీసుకునే ముందు అప్లికెంట్ యొక్క ఫిక్స్‌డ్ ఆబ్లిగేషన్ టు ఇన్‌కం రేషియో (FOIR) ను చూసి అంచనా వేస్తాయి. FOIR అంటే, అప్పటికే ఉన్న ఈఎంఐల మొత్తాన్ని ఆదాయంతో పోల్చిన నిష్పత్తి. సాధారణంగా ఈ నిష్పత్తి 40 శాతం లోపే ఉండాలని బ్యాంకులు చూస్తుంటాయి. అంటే మీరు ఇప్పటికే ఓ హోమ్ లోన్ తీసుకున్నా కూడా, మీరు రెండవ లోన్‌కి కూడా సమర్థవంతంగా ఈఎంఐలు చెల్లించగలుగుతారని రుజువైతే, మరో లోన్ పొందవచ్చు.
ఇకపోతే హోమ్ లోన్ల సంఖ్యపై ప్రభుత్వం లేదా బ్యాంకులు నేరుగా ఎలాంటి పరిమితి విధించకపోయినా, ఎక్కువ లోన్లు మేనేజ్ చేయడం కాస్త కష్టమే. రెండు లేదా మూడు ఈఎంఐలను సమర్థంగా చెల్లించగల సామర్థ్యం ఉంటే తప్ప మల్టిపుల్ హోమ్ లోన్లు తీసుకోవడం సరైంది కాదు. ఇది రుణ చెల్లింపుల్లో ఆలస్యాలకు, క్రెడిట్ స్కోర్ ప్రభావానికి దారితీయవచ్చు. అందుకే ముందుగా మీ ఆర్థిక స్థితిని సరిగ్గా అంచనా వేసుకుని, అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకుని, సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది.