Home » Exclusive » Flipkart Offers Big Discount On Apple Iphones
Exclusive

Flipkart Offers : ఫ్లిప్ కార్ట్ లో బంపర్ ఆఫర్ .. 10 వేలకే ఆపిల్ ఐఫోన్ ..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 5, 2023, 6:00 pm
Advertisement

Flipkart Offers : ఆపిల్ ఐఫోన్ వాడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వాటి ధరలు ఎక్కువగా ఉండడంతో అందరూ కొనలేరు. అందుకే ఆపిల్ సంస్థ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవల ఆపిల్ ఐఫోన్ మినీ వెర్షన్ స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేసింది. ఈ క్రమంలోనే ఐఫోన్ 12 మినీ లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఐఫోన్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్ ను 25 వేల లోపు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో ఈ ఫోన్ ధరలు 64 జిబి వేరియంట్ ధర రూ.50,999, 128 జీబీ ధర రూ.56,999.

Advertisement

Flipkart offers big discount on Apple iphones

పాత ఫోన్ ఎక్సైంజ్ చేస్తే 27 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఐఫోన్ 12 మినీ 25 వేల లోపు పొందవచ్చు. ఫ్లిప్కార్ట్ లో బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. వీటితో కలిపి ఐఫోన్ 12 మినీ ఇంకా తక్కువ ధరకే లభిస్తుంది. అలాగే ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ తో కొంటే ఐఫోన్ 12 మినీ నెలకు 1744 కట్టి సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ఫీచర్ చూస్తే 5.4 అంగుళాల సూపర్ రెటీనా ఎక్సిడిఆర్ డిస్ప్లే ఉంది. ఏ14 బయోనిక్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 5జి నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. బెల్ట్ ఇన్ స్టీరియో స్పీకర్ కూడా ఉంది. ఇక కెమెరా విషయానికొస్తే 12 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.

Advertisement

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో నైట్ మోడ్, ఫోర్ కె డాల్బీ విజన్ హెచ్ డిఆర్ రికార్డింగ్ లాంటివి ఉన్నాయి. అంతేకాకుండా ఫ్లిప్కార్ట్ లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మోడల్స్ తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఐఫోన్ 14 ప్లస్ పదివేలకు తగ్గింది. 128 జీబి ధర రూ. 79,999. 256 జిబీ వేరియంట్ ధర రూ. 89,999. 512 జిబీ ధర రూ. లక్ష గా ఉన్నాయి. అలాగే ఫ్లిప్కార్ట్ లో ఐఫోన్ 14 పై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. దాదాపు 2000 తగ్గింపుతో ఐఫోన్ 14 లభిస్తుంది. ఎవరైనా ఐఫోన్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఆఫర్స్ చూసి కొనుగోలు చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి