
Alert Fraud : గూగుల్ పే, ఫోన్ పే కాకుండా వేరే వాటిపై ఆధారపడుతున్నారా.. మోసపోయినట్టే..!
Alert Fraud : ఈ మధ్య ఆన్‌లైన్‌లో ఎన్నిరకాల మోసాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.టెక్నాలజీ పెరుగుతున్న కొలదీ ఆన్లైన్ మోసాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. విషింగ్ స్కాం, ఫిషింగ్, సిమ్ స్వాప్, స్మిషింగ్, వెబ్‌సైట్ స్పూఫింగ్, మాల్‌వేర్ అటాక్ లాంటి పలు విధానాలు ఉపయోగించి, యూజర్ల డేటాను, వారి ఖాతాలోని డబ్బులను దోచుకుంటున్నారు. అయితే ఈ మధ్య ఆసుపత్రులలో కూడా ఆన్ లైన్ మోసాలు జరుగుతున్నాయి. ‘నేను ఆరోగ్యశ్రీ ఎంప్లాయిని, మీకు కావలసిన బ్లడ్ గ్రూప్ నా దగ్గర ఉంది. జస్ట్ మీరు నా నెంబర్ కు డబ్బులు ఫోన్ పే, లేకుంటే గూగుల్ పే ద్వారా డబ్బులు వేయండి చాలు.. మిగతా సంగతి అంతా నేను చూసుకుంటా అని చెప్పి మోసం చేస్తున్నాడు.
Alert Fraud : గూగుల్ పే, ఫోన్ పే కాకుండా వేరే వాటిపై ఆధారపడుతున్నారా.. మోసపోయినట్టే..!
తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం దుబ్బార్లపల్లి గ్రామానికి చెందిన శివయ్య బీఈడీ చదివి, నిరుద్యోగిగా ఉన్నాడు. బెట్టింగ్, జల్సాలకు అలవాటు పడ్డాడు. వ్యసనాలను తీర్చుకోవడానికి ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. సులభంగా సంపాదించాలనుకున్నాడు. ఈ ఐడియాతో ‘రక్త సంబంధం గ్రూప్ ఆర్గనైజేషన్ ట్రస్టు’ అనే వాట్సాప్ గ్రూపులో మెంబెర్ గా యాడ్ అయిపోయాడు. ఆ గ్రూపులో ఎవరి ఎవరికి రక్తం అవసరమో వారి పేషెంట్స్ బంధువులు మెసేజ్ చేస్తుంటారు. వారిని టార్గెట్ చేసి గ్రూపులో నెంబర్ తీసుకొని మీకు బ్లడ్ కావాలా అని అడుగుతూ వారికి ఫ్రీగా బ్లడ్ ఇస్తామని చెబుతాడు. అంతేకాదు ఉచితంగా వైద్యం కూడా అందిస్తానంటాడు.
అయితే దానికి కొంచెం డబ్బులు ఖర్చు అవుతుందని కూడా చెబుతాడు. ఈ క్రమంలో అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఆర్థో వార్డు, గైనక్ వార్డులో ఉన్న ఐదుగురు రోగుల బంధువులకు ఫోన్ చేసి వారి నుంచి రూ.12 వేలు తన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. సమాచారం అందుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఇతడు ఇప్పటివరకు 12 మందిని మోసం చేసి, రూ.30 వేలు ఖాతాలోకి మళ్లించుకున్నాడు. ఇలా కూడా మోసం చేస్తున్నారా అని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.