Alert Fraud : గూగుల్ పే, ఫోన్ పే కాకుండా వేరే వాటిపై ఆధార‌ప‌డుతున్నారా.. మోస‌పోయిన‌ట్టే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Alert Fraud : గూగుల్ పే, ఫోన్ పే కాకుండా వేరే వాటిపై ఆధార‌ప‌డుతున్నారా.. మోస‌పోయిన‌ట్టే..!

 Authored By ramu | The Telugu News | Updated on :23 January 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Alert Fraud : గూగుల్ పే, ఫోన్ పే కాకుండా వేరే వాటిపై ఆధార‌ప‌డుతున్నారా.. మోస‌పోయిన‌ట్టే..!

Alert Fraud : ఈ మ‌ధ్య ఆన్‌లైన్‌లో ఎన్నిర‌కాల మోసాలు జ‌రుగుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.టెక్నాలజీ పెరుగుతున్న కొలదీ ఆన్​లైన్​ మోసాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. విషింగ్‌ స్కాం, ఫిషింగ్‌, సిమ్‌ స్వాప్‌, స్మిషింగ్‌, వెబ్‌సైట్‌ స్పూఫింగ్‌, మాల్‌వేర్‌ అటాక్‌ లాంటి పలు విధానాలు ఉపయోగించి, యూజర్ల డేటాను, వారి ఖాతాలోని డబ్బులను దోచుకుంటున్నారు. అయితే ఈ మ‌ధ్య ఆసుప‌త్రుల‌లో కూడా ఆన్ లైన్ మోసాలు జ‌రుగుతున్నాయి. ‘నేను ఆరోగ్యశ్రీ ఎంప్లాయిని, మీకు కావలసిన బ్లడ్ గ్రూప్ నా దగ్గర ఉంది. జస్ట్ మీరు నా నెంబర్ కు డబ్బులు ఫోన్ పే, లేకుంటే గూగుల్ పే ద్వారా డబ్బులు వేయండి చాలు.. మిగతా సంగతి అంతా నేను చూసుకుంటా అని చెప్పి మోసం చేస్తున్నాడు.

Alert Fraud గూగుల్ పే ఫోన్ పే కాకుండా వేరే వాటిపై ఆధార‌ప‌డుతున్నారా మోస‌పోయిన‌ట్టే

Alert Fraud : గూగుల్ పే, ఫోన్ పే కాకుండా వేరే వాటిపై ఆధార‌ప‌డుతున్నారా.. మోస‌పోయిన‌ట్టే..!

Alert Fraud ఇలా కూడా మోసాలు..

తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం దుబ్బార్లపల్లి గ్రామానికి చెందిన శివయ్య బీఈడీ చదివి, నిరుద్యోగిగా ఉన్నాడు. బెట్టింగ్, జల్సాలకు అలవాటు పడ్డాడు. వ్యసనాలను తీర్చుకోవడానికి ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. సులభంగా సంపాదించాలనుకున్నాడు. ఈ ఐడియాతో ‘రక్త సంబంధం గ్రూప్ ఆర్గనైజేషన్ ట్రస్టు’ అనే వాట్సాప్ గ్రూపులో మెంబెర్ గా యాడ్ అయిపోయాడు. ఆ గ్రూపులో ఎవరి ఎవరికి రక్తం అవసరమో వారి పేషెంట్స్ బంధువులు మెసేజ్ చేస్తుంటారు. వారిని టార్గెట్ చేసి గ్రూపులో నెంబర్ తీసుకొని మీకు బ్లడ్ కావాలా అని అడుగుతూ వారికి ఫ్రీగా బ్ల‌డ్ ఇస్తామ‌ని చెబుతాడు. అంతేకాదు ఉచితంగా వైద్యం కూడా అందిస్తానంటాడు.

అయితే దానికి కొంచెం డ‌బ్బులు ఖ‌ర్చు అవుతుంద‌ని కూడా చెబుతాడు. ఈ క్రమంలో అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఆర్థో వార్డు, గైనక్ వార్డులో ఉన్న ఐదుగురు రోగుల బంధువులకు ఫోన్ చేసి వారి నుంచి రూ.12 వేలు తన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. సమాచారం అందుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఇతడు ఇప్పటివరకు 12 మందిని మోసం చేసి, రూ.30 వేలు ఖాతాలోకి మళ్లించుకున్నాడు. ఇలా కూడా మోసం చేస్తున్నారా అని తెలుసుకున్న బాధితులు ల‌బోదిబోమంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది