Google Pay Phonepe : ఇక నుండి ఆర్టీసీ బస్సులోను యూపీఐ పేమెంట్స్.. చిల్లర సమస్యకి చెక్ పడ్డట్టే..!
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి. ఛాయ్‌వాలా నుంచి కిరాణ కొట్టు వరకు ప్రతి చిన్నదానికి సైతం ప్రజలు డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడిపోయారు. జేబులో డబ్బులు ఉంచుకోవడం లేదు. నేరుగా డిజిటల్ చెల్లింపులకే ఇష్టపడుతున్నారు. ఇలాంటి తరుణంలో టీజీఎస్ ఆర్టీసీ సైతం ఆ దిశగా ఆలోచనలు చేసింది.
Google Pay Phonepe : ఇక నుండి ఆర్టీసీ బస్సులోను యూపీఐ పేమెంట్స్.. చిల్లర సమస్యకి చెక్ పడ్డట్టే..!
ఇప్పటికే ఓలా, ఊబర్ వంటివి డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఆర్టీసీ సైతం ప్రయాణికులను తమవైపు తిప్పుకోవడానికి డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పించాలని భావిస్తుంది. అందులో భాగంగానే డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది.ఫలితంగా బస్ కండక్టర్లు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న చిల్లర సమస్యకు కూడా చెక్ పెట్టే విధానానికి శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే హైదరాబాద్ నగర పరిధిలోని ఆర్టీసి బస్సుల్లో ఈ నగదు రహిత చెల్లింపుల విధానం అమలవుతోంది. తాజాగా ఈ విధానాన్ని అన్ని ఆర్టీసి డిపోలలో అమలుచేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా ఈ-టిమ్ యంత్రాలను ప్రవేశపెట్టారు.ప్రస్తుతానికి సూపర్ లగ్జరీ, లహరి, రాజధాని వంటి సర్వీసుల్లో మాత్రమే ఈ డిజిటల్ చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్, ఉట్నూరు, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోలలో ఈ సేవలు మొదలయ్యాయి. టిమ్ మిషన్లలో క్యూఆర్ కోడ్ ను ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి యాప్ లతో స్కాన్ చేసి నేరుగా టికెట్ చార్జీలను చెల్లించవచ్చు.
Anil Kumar Yadav : నెల్లూరు జిల్లాలో మైనింగ్ మూసివేతపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్…
Feeding Cows : హిందూ సంస్కృతిలో ఆవులకు ఆహారం పెట్టడం లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది.…
Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా తక్కువే అని చెప్పాలి. జియో…
Morning or night shower : ఇది మనలో చాలా మందికి రోజువారీ ఆచారం. ఉదయం స్నానం లేదా రాత్రి…
Tejaswi Madivada : చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. వారిలో తేజస్వి మదివాడ…
Masoor Dal : ఎర్ర పప్పు అని కూడా పిలువబడే మసూర్ పప్పు, భారతీయ వంటకాల్లో పోషక విలువలు, చికిత్సా…
Ys Jagan : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను…
Garlic : వెల్లుల్లి శతాబ్దాలుగా వంటగదిలో ఉపయోగించే ఒక సుగంధ ద్రవ్యం. ఈ మూలిక దాని యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక స్వభావం…
This website uses cookies.