Google Pay Phonepe : ఇక నుండి ఆర్టీసీ బ‌స్సులోను యూపీఐ పేమెంట్స్.. చిల్ల‌ర స‌మ‌స్య‌కి చెక్ ప‌డ్డ‌ట్టే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Google Pay Phonepe : ఇక నుండి ఆర్టీసీ బ‌స్సులోను యూపీఐ పేమెంట్స్.. చిల్ల‌ర స‌మ‌స్య‌కి చెక్ ప‌డ్డ‌ట్టే..!

 Authored By ramu | The Telugu News | Updated on :19 April 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Google Pay Phonepe : ఇక నుండి ఆర్టీసీ బ‌స్సులోను యూపీఐ పేమెంట్స్.. చిల్ల‌ర స‌మ‌స్య‌కి చెక్ ప‌డ్డ‌ట్టే..!

Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రు కూడా ఏ పేమెంట్ చేయాల‌న్నా దాదాపు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా డిజిటల్‌ చెల్లింపులే జరుగుతున్నాయి. ఛాయ్‌వాలా నుంచి కిరాణ కొట్టు వరకు ప్రతి చిన్నదానికి సైతం ప్రజలు డిజిటల్‌ చెల్లింపులకు అలవాటు పడిపోయారు. జేబులో డబ్బులు ఉంచుకోవడం లేదు. నేరుగా డిజిటల్‌ చెల్లింపులకే ఇష్టపడుతున్నారు. ఇలాంటి తరుణంలో టీజీఎస్ ​ఆర్టీసీ సైతం ఆ దిశగా ఆలోచనలు చేసింది.

Google Pay Phonepe ఇక నుండి ఆర్టీసీ బ‌స్సులోను యూపీఐ పేమెంట్స్ చిల్ల‌ర స‌మ‌స్య‌కి చెక్ ప‌డ్డ‌ట్టే

Google Pay Phonepe : ఇక నుండి ఆర్టీసీ బ‌స్సులోను యూపీఐ పేమెంట్స్.. చిల్ల‌ర స‌మ‌స్య‌కి చెక్ ప‌డ్డ‌ట్టే..!

Google Pay Phonepe ఇక ఆ స‌మ‌స్య ఉండ‌దు..

ఇప్పటికే ఓలా, ఊబర్‌ వంటివి డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఆర్టీసీ సైతం ప్రయాణికులను తమవైపు తిప్పుకోవడానికి డిజిటల్‌ చెల్లింపులకు అవకాశం కల్పించాలని భావిస్తుంది. అందులో భాగంగానే డిజిటల్‌ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది.ఫలితంగా బస్ కండక్టర్లు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న చిల్లర సమస్యకు కూడా చెక్ పెట్టే విధానానికి శ్రీకారం చుట్టారు.

ఇప్పటికే హైదరాబాద్ నగర పరిధిలోని ఆర్టీసి బస్సుల్లో ఈ నగదు రహిత చెల్లింపుల విధానం అమలవుతోంది. తాజాగా ఈ విధానాన్ని అన్ని ఆర్టీసి డిపోలలో అమలుచేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా ఈ-టిమ్ యంత్రాలను ప్రవేశపెట్టారు.ప్రస్తుతానికి సూపర్ లగ్జరీ, లహరి, రాజధాని వంటి సర్వీసుల్లో మాత్రమే ఈ డిజిటల్ చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్, ఉట్నూరు, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోలలో ఈ సేవలు మొదలయ్యాయి. టిమ్ మిషన్లలో క్యూఆర్ కోడ్ ను ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి యాప్ లతో స్కాన్ చేసి నేరుగా టికెట్ చార్జీలను చెల్లించవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది