Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్.. రికార్డ్ స్థాయిలో అమ్మకాలు!
ప్రధానాంశాలు:
Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్.. రికార్డ్ స్థాయిలో అమ్మకాలు!
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా (Vida) జూలై 2025లో రికార్డు స్థాయిలో స్కూటర్ అమ్మకాలు నమోదు చేసింది. గవర్నమెంట్ వాహన డేటా ప్రకారం, ఒక్క నెలలోనే 10,489 విడా స్కూటర్లు విక్రయమయ్యాయి. ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో 2022లో ప్రవేశించిన తర్వాత ఇదే అత్యధిక నెలవారీ అమ్మకాల గణాంకం కావడం గమనార్హం.

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్.. రికార్డ్ స్థాయిలో అమ్మకాలు!
Hero Vida : భారీ అమ్మకాలు..
జూలై 2024తో పోలిస్తే (అప్పుడు 5,067 యూనిట్లు అమ్మకాలు) ఈసారి 107 శాతం వృద్ధి నమోదైంది. అంతేకాదు, మార్చి 2025లో జరిగిన 8,040 యూనిట్ల అమ్మకాలను కూడా దాటింది. మొత్తం జూలై నెలలో భారత్‌లో 1.02 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడవగా, వాటిలో విడా వాటా 10 శాతం దాటింది. ఇది హీరో మోటోకార్ప్‌కు మైలురాయిగా నిలిచింది.
జనవరి 2025లో 1,626 యూనిట్ల విక్రయాల నుంచి ప్రారంభమైన విడా ప్రయాణం జూలైలో 10,489 యూనిట్ల వరకు చేరుకుంది. అంటే ఏడాది తొలి ఏడాది నెలల్లో 545 శాతం వృద్ధి. 2025 ప్రారంభంలో కలిగిన 4% మార్కెట్ వాటా ఇప్పుడు 6%కి పెరిగింది. ఈ పెరుగుదలతో 2025 చివరికి విడా అమ్మకాలు 1 లక్ష యూనిట్ల మార్క్ దాటే అవకాశం ఉంది. జూలై 2న విడుదలైన Vida VX2 సంస్థకు మరో మేజర్ బూస్ట్ ఇచ్చింది. ఇలా చూస్తే, 2025 సంవత్సరం హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ విభాగానికి గోల్డెన్ ఇయర్ గా మారుతుంది. Vida VX2 వంటి మొబిలిటీని మరింత అందుబాటులోకి తీసుకొచ్చే స్కూటర్లతో, సంస్థ మార్కెట్లో తనదైన స్థానాన్ని స్థిరపరిచే దిశగా ముందడుగులు వేస్తోంది.