Jobs : తక్కువ ఒత్తిడి ఎక్కువ జీతం .. బెస్ట్ ఉద్యోగాలు ఇవే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jobs : తక్కువ ఒత్తిడి ఎక్కువ జీతం .. బెస్ట్ ఉద్యోగాలు ఇవే !

 Authored By aruna | The Telugu News | Updated on :24 June 2023,12:00 pm

Jobs  : మనం బ్రతకడానికి ఏదో ఒక పని చేయాలి. అందులో ఆదాయం హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కానీ ప్రతి పనిలో కష్టం ఉంటుంది. చాలామంది డబ్బును ఆశించే వారు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. కానీ కొందరు డబ్బు అవసరం లేకుండా లైఫ్ సంతోషంగా ఉంటే చాలు అనుకుంటారు. ఈ క్రమంలోనే ఆదాయం తక్కువ వచ్చిన కన్వీనెంట్ జాబ్స్ చూసుకుంటారు. కానీ కొన్ని జాబ్స్ తక్కువ కష్టంతోపాటు ఆదాయం ఎక్కువగా వస్తుంది. రోజుకి రెండు మూడు గంటలు పని చేస్తే సాఫ్ట్వేర్ జీతం వస్తుంది. అలాంటి ఉద్యోగాలు రావాలంటే ముందుగా కొంచెం కష్టపడాలి. ప్రస్తుతం టెక్నాలజీని బాగా ఉపయోగిస్తున్నారు. ప్రతి పనిని టెక్నాలజీతో పూర్తి చేస్తున్నారు.

వ్యవసాయ రంగంలోని టెక్నాలజీని ఉపయోగించి పంటలు పండిస్తున్నారు. ఎంత టెక్నాలజీ ఉన్న మానవ వనరుల అవసరం తప్పనిసరిగా ఉంటుంది. స్కూల్ నుంచి కాలేజీ వరకు విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి టీచర్లు లెక్చరర్లు ఉన్నారు. టీచింగ్ జాబ్ అయితే ఎనిమిది నుంచి పది గంటలు పని చేయాల్సి ఉంటుంది. పీహెచ్డీ చేయడం వలన మంచి ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని కాలేజీలు పిహెచ్డి చేసిన వారిని ప్రత్యేకంగా నియమించుకొని వారితో బోధన చేస్తుంది. ఇలా వీరు రెండు మూడు గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. కానీ వీరికి లక్షల్లో జీతం ఉంటుంది. దీనికి ఒత్తిడి తక్కువగా ఉంటుంది.

high salary low stress jobs

high salary low stress jobs

సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ శాఖల్లో వర్క్ లోడ్ తక్కువగా ఉండటం వల్ల చాలామంది ఫ్రెషర్ లేని జాబ్ కావాలనుకునేవారు వీటిని ప్రయత్నించవచ్చు. ప్రస్తుతం ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాయి. యాక్సిడెంట్, లైఫ్ తోపాటు ఇతర రకాల ఇన్సూరెన్స్ పాలసీలను అమ్మడం ద్వారా కమిషన్ వస్తుంది. ఒకప్పుడు ఎల్ఐసి గురించి తెలియక పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడు దీనిపై చాలామంది అవగాహన పొందారు. దీంతో పాలసీలు కొనుక్కోవడానికి వినియోగదారులు ముందుకు వస్తున్నా.రు అలాంటి వారిని క్యాచ్ చేస్తే కమీషన్ వస్తుంది. ఇలాంటి ఉద్యోగాల్లో జీతం ఎక్కువగా ఒత్తిడి తక్కువగా ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది