Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

 Authored By ramu | The Telugu News | Updated on :7 September 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు... ఎలాగో తెలుసా...!!

Internet  : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మద్యం మరియు గంజాయి, పొగాకు లాంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఇలాంటిదే మరొక వ్యసనం కూడా ఉన్నది. అదే ఇంటర్నెట్ అడిక్షన్. ఇది ప్రత్యక్షంగా ఎలాంటి హాని కలిగించినప్పటికీ మద్యపానం మరియు సిగరెట్ కంటే కూడా ఇది ఎంతో హానికరమైనది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ 8 నుండి 80 ఏళ్ల అందరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో మునిగిపోతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో ఈ మొబైల్ ఫోన్ తో చేయలేని పని అంటూ ఏదీ లేదు. నిజం చెప్పాలంటే. మన అరచేతిలోకి ప్రపంచమే వచ్చినట్టు ఉంటుంది. అయితే ఈ వ్యసనానికి అలవాటు పడిన తర్వాత దీని నుండి బయట పడడం చాలా కష్టం అవుతుంది. అలాగే ఇంటర్నెట్ కూడా అలాంటిదే. మనం దీని మాయలో గనక పడితే రోజులు గంటలలోనే గడిచిపోతాయి. అందుకే ప్రమాదం ముంచుకు రాకముందే ఎంతో జాగ్రత్త పడాలి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు…

రోజంతా ఎటువంటి పనులు చేసినా కూడా మనసంతా మొబైల్ పైనే ఉంటుంది. అలాగే మనం పని చేసే టైంలో కూడా మొబైల్లో ఏదో ఒకటి చూడటం అలవాటయింది. అయితే రోజు మొత్తం మొబైల్ చూడకుండా ఉన్నట్లయితే పని తొందరగా చేయటంతో పాటుగా సమయం కూడా ఆదా అవుతుంది. అలాగే మీరు సోషల్ మీడియాలో పెట్టేటటువంటి పోస్టులకు ఎంతమంది లైక్ లు ఇచ్చారు మరియు ఎంతమంది చూశారు లాంటి సిల్లీ విషయాల కోసం కూడా అతిగా ఆలోచించడం మంచిది కాదు. అయితే మన మనసు వేరే పనిమీద మళ్లకుండ కేవలం మొబైల్ ఫోన్ తోనే గడిపేస్తూ ఉంటే మెల్లమెల్లగా వ్యసనం వైపు ప్రయాణం చేస్తున్నట్లే అని అర్థం చేసుకోవాలి…

Internet ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు ఎలాగో తెలుసా

Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

అలాగే ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం కంటే నెట్ వరల్డ్ అట్రాక్షన్ ఎక్కువైనట్లయితే టెన్షన్ ను మానుకోవటం కూడా మంచిది. లేకుంటే మీ నెట్ అడిక్షన్ అనేది పెరిగిపోతుంది. అలాగే టైం ఉన్నప్పుడు ఈ వ్యసనాన్ని వదిలించుకోవడం గురించి ఆలోచించండి. మీ మొబైల్ కాక ఇతర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. లేక స్నేహితులతో బయటకు వెళ్లడం మరియు కుటుంబంలోని ఇతర వ్యక్తులకు టైం ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే మీ రోజుల్లో కొంత టైం వ్యాయామం చేయాలి. అంతేకాక మొబైల్ ఏయే విషయాలను చూడాలో ఖచ్చితంగా నిబంధనలు పెట్టుకుంటే మంచిది…

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది