iPhone 13 : 40 వేలకే ఐఫోన్ 13.. త్వరపడండి.. ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్లపై భారీ ఆఫర్లు
iPhone 13 : ఐఫోన్ కావాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఐఫోన్ అంటేనే బ్రాండ్. అది చేతుల్లో ఉంటే చాలు.. అదో సంతృప్తి. బ్రాండ్ అది అంతే. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ బిగ్ దసరా సేల్ ను ప్రకటించింది. దీంట్లో స్మార్ట్ ఫోన్ల మీద పలు భారీ ఆఫర్లను ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ లో భాగంగా ఐఫోన్ 13 మీదద భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. అయినా కూడా మళ్లీ ఇప్పుడు బిగ్ దసరా సేల్ ను ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చింది.
ఐఫోన్ 13 మీద భారీ డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చింది. ఐఫోన్ 13 మీద 14 శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది. నిజానికి.. ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 13 ధర రూ.59,990 గా ఉంది. అయితే.. ఫ్లిప్ కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.3 వేలు డిస్కౌంట్ లభించనుంది. అంటే 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దానితో పాటు ఎక్స్ చేంజ్ ఆఫర్ కింద రూ.16,900 డిస్కౌంట్ లభిస్తుంది.

iphone 13 can be purchased for rs 40000 in flipkart
iPhone 13 : ఆఫర్ల కింద రూ.40 వేలకే లభించనున్న ఐఫోన్ 13
మీదగ్గర పాత ఫోన్ ఉండి, ఫ్లిప్ కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు ఉంటే.. ఐఫోన్ 13 ను కేవలం రూ.40 వేలకే సొంతం చేసుకోవచ్చు. పాత ఫోన్ కు ఎక్స్ ఛేంజ్ కింద కనీసం రూ.16,900 డిస్కౌంట్ వస్తుంది. మొత్తం మీద కేవలం రూ.40 వేలకే ఐఫోన్ 13 ను సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ బిగ్ దసరా సేల్ తో పాటు పలు ఇతర ప్లాట్ ఫామ్స్ లోనూ ఐఫోన్ 13 పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.53 వేలకు క్రోమాలో ఐఫోన్ 13 ను పొందొచ్చు.